వాల్తేరు హీరోయిన్ అప్సెట్ అయ్యిందా..!

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో బాబీ డైరెక్షన్ లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కేథరిన్ త్రెసా నటిస్తుంది.ఈ సినిమాలో రవితేజకి జోడీగా కేథరిన్ కనిపించనుందట.

 Heroine Upset With Waltair Veerayya Movie , Catherine Tresa , Megastar Chiranjee-TeluguStop.com

అయితే సినిమా మీద కేథరిన్ త్రెసా అసంతృప్తిగా ఉందని టాక్.సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కేథరిన్ కేవలం కొద్ది నిమిషాల పాత్రే చేసిందట.

అయితే ముందు డైరెక్టర్ సినిమాలో ఆమెకు కూడా ఒక పాట పెడతానని అన్నారట.కానీ రన్ టైం ఎక్కువ అవుతుందని వద్దనుకున్నారట.అయితే చిరు సినిమాలో ఒక పాటలో ఉంటానని భావించిన కేథరిన్ త్రెసా అప్సెట్ అయినట్టు టాక్.రవితేజతో ఆమెకు మంచి సీన్స్ ఉన్నా చిరుతో డ్యాన్స్ చేసే అవకాశం కోల్పోయినందుకు నిరాశ చెందిందట.

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో కూడా కేథరిన్ అంత యాక్టివ్ గా పాల్గొనకపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు.కేథరిన్ త్రెస అందం అభినయం ఉన్నా సరే లక్ కలిసి రాని ఈ అమ్మడు ఇలా అర కొర అవకాశాలతోనే కెరీర్ వెళ్లదీస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube