టీడీపీ రెబల్ నేత చింతమనేని ప్రభాకర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఏపీ పోలీసులపై మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో పనిచేస్తున్న ఏ పోలీస్ నీ వదలం.అనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏం తప్పు చేశానని నా చొక్కా చించారు.మంగళవారం తన పుట్టినరోజు నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు పరిశీలన కోసం వెళితే పోలీసులు అత్యుత్సాహంగా తన పట్ల వ్యవహరించారని చింతమనేని తెలియజేశారు.
అత్యుత్సాహం చూపిన పోలీసులకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటదని అన్నారు.తన పట్ల డిఎస్పి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.నా బర్త్ డే నాడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకోవడం నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

హరిరామజోగయ్య అదే ఆసుపత్రిలో ఉన్నారన్న కారణంతో తనను అడ్డుకున్నారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు.నాపై 31 కేసులు పెట్టారు.
అయినా న్యాయం కోసం పోరాడుతా అంటూ చింతమనేని మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.







