టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న త్రిష ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు.పొన్నియిన్ సెల్వన్ సినిమాతో త్రిష ఖాతాలో మరో సక్సెస్ చేరింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెల 28వ తేదీన పొన్నియిన్ సెల్వన్ పార్ట్2 రిలీజ్ కానుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా త్రిష ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.
35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి త్రిష ఈ ఇంటిని కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.నటుడు విజయ్ ఇంటికి దగ్గర్లో త్రిష ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి.
ఈ కొత్త ఇంటిలోనే త్రిష నివశించనున్నారని తెలుస్తోంది.నటిగా త్రిష రేంజ్ అంతకంతకూ పెరగనుందని తెలుస్తోంది.త్రిష ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

యాడ్స్ ద్వారా కూడా ఈ బ్యూటీకి భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుతోంది.మరోవైపు త్రిష పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తల గురించి త్రిష ఇప్పటికే స్పందించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.త్రిష వయస్సు పెరుగుతున్నా పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు.
ది రోడ్, రామ్ పార్ట్1 సినిమాలలో త్రిష నటిస్తున్నారు.

త్రిష క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.మరోవైపు త్రిష తెలుగు సినిమాల ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను రిజక్ట్ చేస్తున్నారు.త్రిష తెలుగు సినిమాలపై ఎందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.
నటిగా త్రిష స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరు స్టార్ హీరోలలకు జోడీగా త్రిష నటించారు.







