ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కరువు బాగా ఉన్న సమయంలో శ్రీలీల( Sreeleela ) ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందరి తో ఎంట్రీ ఇచ్చి ధమాకా తో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయిపోయింది.
సెప్టెంబర్ లో స్కంద, అక్టోబర్ లో భగవంత్ కేసరి, నవంబర్ లో అది కేశవ, డిసెంబర్ లో ఎక్సట్రాడినరీ మ్యాన్ సినిమాలతో ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది.రెండేళ్లకు ముందు కమిట్ అయినా సినిమాలన్నీ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం కాగా, ఒప్పుకున్నా సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని సినిమాలు డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసుకుంది కూడా.
ఈ సినిమాలు విడుదల అయ్యాక వచ్చే ఏడాది కి ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం, అనగనగా ఒక రాజు సినిమాలు మాత్రమే ఆమె చేతిలో షూటింగ్ పెండింగ్ ఉన్న సినిమాలు.అదేంటి మొన్నే వచ్చిన శ్రీలీల రెండో ఇన్నింగ్స్ కూడా మొదలెట్టేసిందా ?

ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) సరసన, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో చేయాల్సి ఉండగా కేవలం డేట్స్ కారణంగానే వదిలేసింది.దాంతో పాటు మరొక రవి తేజ చిత్రం కూడా ఈ అమ్మడు చేయలేకపోయింది.ఇక అంతకు ముందు కమిట్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఉండటం తో మళ్లి కొత్త సినిమాలపైనే ఫోకస్ చేసే పనిలో పడిందట శ్రీలీల.
ఈ క్రమం లోనే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం లో తెరకెక్కిస్తున్న సినిమా కోసం శ్రీ లీల ను తీసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది.

మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవి తేజ, బాల కృష్ణ వంటి స్టార్స్ పక్కన నటించి సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్( Prabhas ) వంటి ఫ్యాన్ ఇండియా హీరో పక్కన నటించేందుకు సిద్ధం అవుతుంది.వీళ్లే కాకుండా రామ్ చరణ్, తారక్, బన్నీ సినిమాలను కూడా కమిట్ చేస్తే చూడాలని ఉంది అంటూ ఆ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.మరి శ్రీలీల రేంజ్ ఏంటో ఆమె స్టామినా ఏంటో ఈ ఏడాది విడుదల అవుతున్న సినిమాలతో తేలిపోతుంది.
అప్పుడు మిగతా హీరోలను కవర్ చేయడం పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు లేండి.







