బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న స్నేహా ఉల్లాల్

ఇండియాలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.అన్ని భాషలలో ఈ బిగ్ షో షో సూపర్ హిట్ అయ్యింది.

 Actor Sneha Ullal Has Confirmed To Enter Bigg Boss House, Bollywood, Salman Khan-TeluguStop.com

దీంతో ప్రతి ఏడాదికి ఒక సీజన్ పాటు ఈ బిగ్ బాస్ షోని నిర్వాహకులు నడుపుతున్నారు.ఇక ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4కి రంగం సిద్ధమైపోయింది.

ఇప్పటికే కింగ్ నాగార్జున బిగ్ బాస్ ప్రోమోలతో సందడి చేస్తున్నారు.మరో వైపు హిందీలో కూడా బిగ్ బాస్ సీజన్ 14కి ఏర్పాట్లు మొదలైపోయాయి.

ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.బిగ్ బాస్ హిందీకి సంబందించిన ఫస్ట్ ప్రోమోని నేడు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక సెప్టెంబర్ లో ఈ షో మొదలవుతుంది.ఇక ఇప్పటికే షోలో పాల్గొనే పార్టిసిపెంట్లని ఎంపిక చేయడం కూడా జరిగిపోయిందని తెలుస్తుంది.

ఈ జాబితాలో టీవీ సెలబ్రిటీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే గుర్తింపు తెచ్చుకొని తరువాత తెలుగులో కొంత వరకు సక్సెస్ అయిన అందాల భామ స్నేహా ఉల్లాల్.

ఈ అమ్మడు తెలుగులో బాలకృష్ణకి జోడీగా సింహ సినిమాలో కూడా నటించింది.అయితే గ్లామర్ ఉన్న యాక్టింగ్ పరంగా ఈమె మెప్పించలేకపోవడంతో తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

ఆ మధ్య ఈమె అరుదైన వ్యాధికి గురై మళ్ళీ కోలుకుంది.అయితే ఇప్పటికే ఆ వ్యాధి లక్షణాలతో అప్పుడప్పుడు ఆమె వెన్నునొప్పితో బాధపడుతుంది.అయిన మళ్ళీ నటిగా రీఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది.ఈ నేపధ్యంలో అనూహ్యంగా ఈమె పేరు బిగ్ బాస్ లో పాల్గొనే జాబితాలో ప్రముఖంగా వినిపిస్తుంది.

అయితే ఇది తెలుగు బిగ్ బాస్ కాదు.సల్మాన్ ఖాన్ సారధ్యంలో నడిచే హిందీ బిగ్ బాస్ షో కోసం స్నేహ ఉల్లాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube