ఆయనే నా ఫస్ట్ క్రష్.. వైరల్ అవుతున్న శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్( Shruti Haasan ) ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే సినిమాలు చేస్తున్నారు.అయితే శృతి హాసన్ పరిమిత సంఖ్యలో సినిమాలు చేస్తున్నా ఆమె చేసే ప్రతి కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

 Heroine Shruti Haasan Sensational Comments Details Here Goes Viral In Social Me-TeluguStop.com

తన ఫస్ట్ క్రష్ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

హాలీవుడ్ నటుడు బ్రూస్ లీ( Bruce Lee ) తన తొలి క్రష్ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతి హాసన్ ఈ విషయాలను వెల్లడించారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ తరచూ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

తన మనస్సులో ఏదీ దాచుకోకుండా మనస్సులోని భావాలను వెల్లడించే విషయంలో ఆమె ముందువరసలో ఉంటారు.

ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను తరచూ షేర్ చేస్తున్న శృతి హాసన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాల్సి ఉంది.శృతి హాసన్ ఇతర భాషల్లో కూడా కంటే తెలుగులోనే ఎక్కువగా సక్సెస్ సాధించడం గమనార్హం.శృతి హాసన్ పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

కథకు, పాత్రకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ బ్యూటీ మంచి కథలను ఎంపిక చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

సలార్( Salaar ) సినిమాలోని రోల్ షూట్ ను పూర్తి చేసిన శృతి హాసన్ తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లను మాత్రం ప్రకటించడం లేదు.శృతి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగులో మరింత బిజీ కావడంతో పాటు కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube