Sruthi Haasan: పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్.. పోటీ అక్కడి నుండేనా..?

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ సెలెబ్రిటీలు ఓవైపు సినిమాల్లో సక్సెస్ అవుతూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.కేవలం సీనియర్ నటినటులు మాత్రమే కాకుండా యంగ్ హీరో హీరోయిన్స్ కూడా రాజకీయాల్లోకి రావడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.

 Heroine Shruti Haasan Comments On Her Political Entry-TeluguStop.com

అయితే తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ( Kamal haasan ) కూతురు శృతిహాసన్ కూడా పాలిటిక్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే చాలా రోజుల నుండి శృతిహాసన్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయబోతుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ అందులో ఏది నిజం కాలేదు.

Telugu Salaar, Hollywood, Kamal Haasan, Prabhas, Sruthi Haasan-Latest News - Tel

అయితే మరోసారి శృతిహాసన్ ( Shruti Haasan ) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు కుప్పలు తెప్పలుగా వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వార్తల గురించి తాజాగా కోయంబత్తూర్ మీడియాతో మాట్లాడుతూ శృతిహాసన్ ఆసక్తికర కామెంట్లు చేసింది.శృతిహాసన్ కోయంబత్తూర్ మీడియా( Coimbatore Media )తో మాట్లాడుతూ.చాలా రోజుల నుండి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ ప్రచారం చేస్తున్నారు.అయితే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.ప్రస్తుతం నేను సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాను.

Telugu Salaar, Hollywood, Kamal Haasan, Prabhas, Sruthi Haasan-Latest News - Tel

అలాగే నాకు పాలిటిక్స్( Politics ) అంటే కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు.రాజకీయాల్లోకి రావాలనే కోరిక కూడా నాకు లేదు.సినిమాల్లోనే స్టార్ గా రాణించాలి అనుకుంటున్నాను.అంటూ శృతిహాసన్ తన రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న ప్రచారాలపై క్లారిటీ ఇచ్చింది.ఇక ప్రస్తుతం శృతిహాసన్ ఓ హాలీవుడ్ మూవీ తో పాటు తెలుగు,హిందీ, తమిళ భాషల్లో బిజీబిజీగా ఉంది.ఇక ఈమె పాన్ ఇండియా మూవీ అయినా సలార్ ( Salaar ) లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube