ఆ ఐటమ్ సాంగ్ కు ఊరమాస్ డ్యాన్స్ చేసిన సాయిపల్లవి.. భారీ షాక్ ఇచ్చిందిగా!

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి( Sai Pallavi ) మంచి డ్యాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పరంగా మళ్లీ బిజీ అయిన సాయిపల్లవి డ్యాన్స్( Sai Pallavi Dance ) వల్లే ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారని చాలామంది భావిస్తున్నారు.

 Heroine Sai Pallavi Dance Video Goes Viral In Social Media Details, Sai Pallavi,-TeluguStop.com

ఆమెతో పోటీ పడి డ్యాన్స్ చేయడం కష్టమని చాలామంది హీరోలు ఫీలవుతారు.స్టార్ హీరోలతో పోల్చి చూస్తే మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా సాయిపల్లవికి ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

అయితే సాయిపల్లవి డ్యాన్స్ కు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.స్నేహితులతో కలిసి షీలా కీ జవానీ సాంగ్ కు( Sheela ki Jawani Song ) సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్ చేయగా ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఎలాంటి కఠినమైన స్టెప్ అయినా అలవోకగా చేసే సాయిపల్లవి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం సాయిపల్లవి రామాయణం( Ramayanam ) ప్రాజెక్ట్ లో సీతగా నటిస్తున్నారు.

సాయిపల్లవి ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లన్నీ క్రేజీ ప్రాజెక్ట్ లు కావడంతో రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ కెరీర్ పరంగా మరింత ఎదగడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.రామాయణం ప్రాజెక్ట్ కు సాయిపల్లవి భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.సాయిపల్లవి స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

సాయిపల్లవి టాలీవుడ్ టైర్1 హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయిపల్లవి గతంలో పరిమితంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు.సాయిపల్లవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్ చేసి ఒకింత భారీ షాక్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సాయిపల్లవి రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube