భయంకరమైన పులుల మధ్య సఫారీ రైడ్ చేస్తున్న సదా.. వైరల్ అవుతున్న ఫోటోలు?

జయం సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన నటి సదా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని అనంతరం తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ విధంగా అగ్ర హీరోలు అందరి సరసన నటించిన సదా ప్రస్తుతం హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Heroine Sadaa Safari Ride With Tigers Video Viral Details, Sada ,riding Safari ,-TeluguStop.com

ఇలా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైన సదా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె అతి భయంకరమైన పులులు మద్య సఫారీ రైడ్ చేస్తూ ఎంతో చిల్ అవుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ రైడ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈమె మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కులో సఫారి రైడ్‌కు వెళ్లింది.

అదికూడా భయంకరమైన పెద్ద పులులు తిరిగే అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పులులు ఇతర అడవి జంతువుల ఫోటోలను తన కెమెరాలో బంధించింది.

ప్రస్తుతం ఈ రైడ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలాగే ఈ రైడ్ కు సంబంధించిన విషయాలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి వెండితెరకు దూరమైన సదా బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ సందడి చేశారు.

అయితే ప్రస్తుతం హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 లో ప్రసారమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube