గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి జి రామయ్య డిమాండ్ చేశారు.ఈరోజు (శుక్రవారం) రఘునాధపాలెం మండలం ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జి రామయ్య మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కార్మికులు ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ వారి బ్రతుకులు మాత్రం గ్యారంటీ లేని జీవితాలు అనుభవిస్తున్నారు.కార్మికులకు కనీస వేతనాలు జీవోలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కరోనాన్ని కూడా సైతం లెక్కచేయకుండా గ్రామాల పరిశుభ్రతను కాపాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం దారుణమని ఏమని వారన్నారు.
ఇప్పటికీ మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులపై పని భారాన్ని పెంచుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పెరిగిన జనాభా కనుగొనంగా గ్రామ పంచాయతీలలో కార్మికులను పెంచాలని వారు కోరారు.
తెలంగాణ ప్రభుత్వం గతంలో అన్ని రంగాల కార్మికులకు 30% పిఆర్సిపించి గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం మొండిచెయ్యి చూపించిందని కనీసం కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారి కోరా రు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు 30 శాతం పిఆర్సి వెంటనే అమలు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమాలు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్( ఐ ఎఫ్ టి యు) అనుబంధం మండల నాయకులు ఎం లక్ష్మీనారాయణ.ఎం నరేష్.ఎం రవీందర్.మోహన్.
బి.రవి.ఎం రాజు.జెలయా తదితరులు పాల్గొన్నారు
.