ఆ టైమ్ లో చాలా టెన్షన్ పడ్డాను.. పుష్ప గురించి రష్మిక కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొంత సమయంలోనే పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగిన హీరోయిన్లలో నటి రష్మిక ఒకరు.

ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించగా, రష్మిక శ్రీ వల్లి అనే ఒక గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది.గత కొద్ది రోజుల క్రితం శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఈ పోస్టర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

అదే విధంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇదిలా ఉండగా అక్టోబర్ 13వ తేదీ శ్రీ వల్లికి సంబంధించిన.

Advertisement

పుష్ప రాజ్ మనసు దోచుకుంది.ఇప్పుడు మన ఊపిరిని ఆపేసెందుకు వస్తోంది శ్రీవల్లి.

అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఇందులో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతోందని, ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక వైవిధ్యభరితమైన పాత్రలో తనని చూస్తారని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు.అదే విధంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడంతో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పుడు మొదట్లో చాలా భయం వేసింది.

ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అని ఎంతో కంగారుపడ్డానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.అయితే చిత్రబృందం ముందుగా చెప్పిన విడుదల తేదీకి సినిమా వాయిదా పడింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు