టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh)కు ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే.ఇటీవల గాయపడిన రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh) ఆ గాయం నుంచి కోలుకుని తర్వాత సినిమాల పనులతో బిజీ అవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
మీరు ప్రాణ స్నేహితుడిని వివాహం చేసుకున్న సమయంలో మీ లైఫ్ మరింత ఆనందంగా మారుతుందని ఆమె తెలిపారు.
మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ ప్రతి పనికి మద్దతు ఇచ్చే భాగస్వామి మీ లైఫ్ లోకి వస్తే ప్రతిదీ అందంగా కనిపిస్తుందని రకుల్ (Rakul)కామెంట్లు చేశారు.గాయపడిన తర్వాత నా శరీరంపై నాకు గౌరవం పెరిగిందని రకుల్ చెప్పుకొచ్చారు.
నేను కెరీర్ పై దృష్టి పెట్టడం నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

ఏదీ అతిగా చేయకూడదని నాకు అర్థమైందని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.అందరికీ నేను ఇచ్చే సలహా ఒకటేనని మీ శరీరం మాట మీరు వినాలని రకుల్ చెప్పుకొచ్చారు.పరిమితికి మించి వ్యాయామం చేయవద్దని ఆమె కోరారు.
గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్ లోకి రావడం ఆనందంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

తాను ఉత్సాహంతో పాటు ఉద్వేగానికి లోనవుతున్నానని రకుల్ తెలిపారు.ఇకపై ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా వర్క్ చేయాలని ఆమె చెప్పుకొచ్చారు.మేరే హస్బెండ్ కీ బీవీ అనే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం నటిస్తున్నారు.
ఈ సినిమాకు రకుల్ భర్త నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సెట్స్ లో మేము ప్రొఫెషనల్ గా ఉంటామని ఆమె పేర్కొన్నారు.