కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా అరుంధతి సినిమా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అరుంధతి కేరాఫ్ అడ్రస్ గా మారింది.2009లో విడుదలైన ఈ చిత్రానికి అనుష్క కన్నా ముందు చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట దర్శకుడు కోడి రామకృష్ణ.
ఇక ఈ చిత్రం కాకుండా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి( Jagadeka Veerudu Athiloka Sundari ) సినిమాలో చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్స్ గా కలిసి నటించారు.1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన రికార్డులను నమోదు చేసింది.అయితే శ్రీదేవి కన్నా ముందు రాఘవేంద్రరావు కూడా పలువురు హీరోయిన్స్ ని శ్రీదేవి నటించిన అతిలోక సుందరి పాత్ర కోసం అనుకున్నాడట.
ఇలా ఈ రెండు సినిమాలు వేరు వేరు దర్శకులు తీసిన, వేరువేరు సమయాల్లో విడుదలైనప్పటికీ ఇందులో ఒక కామెంట్ విషయం ఉంది.అదేంటంటే ఈ రెండు సినిమాల కోసం ఒకే హీరోయిన్ ని అడిగారట.అయితే అంతకుముందే కొన్ని సినిమాలు కమిట్ అవ్వడంతో ఈ రెండు చిత్రాలను సదరు ఓకే చెప్పలేక పోయిందట.ఆమె మరెవరో కాదు దేవి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి ప్రేమ( Prema )అప్పుడప్పుడు సినిమా కెరియర్ ను ప్రారంభిస్తున్న నటి ప్రేమ కన్నడ సినిమా రంగంలో తొలిసారిగా నటించింది.1995లో మొదటిసారి తిరగటం చేసిన ప్రేమ తెలుగులో మాత్రం వెంకటేష్ హీరోగా ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ తర్వాత సౌత్ ఇండియాలోని పలు భాషల్లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది.
అయితే తనకు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మిస్ అవ్వడం మాత్రం ఎంతో బాధని మిగిలించిందని ప్రేమ ఎమోషన్ అవుతోంది.మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మిస్ చేసిన ఈ సినిమాల గురించి ఆమె ఓపెన్ అయ్యింది.ఇక అరుంధతి సినిమా(Arundhati ) సంగతి పక్కన పెడితే శ్రీదేవి నటించిన అతిలోకసుందరి పాత్ర మాత్రం తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా అయిపోయి థర్డ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేమకు భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు రావాలని కోరుకుందాం.