Pooja Hegde : తెలుగు సినిమా ఆఫర్స్ వస్తే ఓకే.. రాకపోతే డబల్ ఓకే అంటున్న పూజ

గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ అయిపొయింది… ఒకప్పుడు ఆ హీరోయిన్ మాత్రమే కావాలని పట్టుబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ బుక్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఆ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.పైగా ఆమె సైతం తెలుగు సినిమాల్లో, తెలుగు హీరోలతో నటించాలనే కుతూహలం తో ఏమి లేదు.

 Heroine Pooja Hege Back To Back Bollywood Offers-TeluguStop.com

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా ? ఇంకెవరండీ బాబు మన పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే( Pooja Hegde ). ప్రస్తుతం ఈ కుర్రదాని చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.అందుకు ఆమె ఇక టాలీవుడ్ కి గుడ్ బై చెప్పినట్టే అందరు భావిస్తున్నారు.మరి పూజ కు అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏంటి ? ఎక్సపైరీ డేట్ దగ్గర పడిందా అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Telugu Bollywood, Guntur Karam, Koi Ishq, Pooja Hegde, Shahid Kapoor, Tollywood-

పూజ ఒక్కసారి హిట్ టాక్ రాగానే టాలీవుడ్ లో ఉన్న అందరు హీరోలతో కలిసి నటించింది.అల్లు అర్జున్, తారక్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరితోను జోడి కట్టింది.అయితే ఇప్పుడు మాత్రం పూజకు అవకాశాలు తెలుగులో దొరకడం లేదు.ఛాన్సులు రాకపోవడం తో బాలీవుడ్( Bollywood ) పై తన ఫోకస్ పెంచింది.పెద్ద హీరోలు కాకపోతే సెకండ్ రేంజ్ హీరోల పైన కూడా నమ్మకం పెట్టుకున్న అది కూడా వర్క్ అవుట్ అవ్వడం లేదు.మహేష్ బాబు పక్కన గుంటూరు కారం సినిమాలో( Guntur Karam ) నటించాల్సి ఉండగా అది కూడా అమ్మడు చేజారి పోయింది.

ఈ లెక్క ప్రకారం చూసుకుంటే తెలుగు లో ఆమె హీరోయిన్ గా నటించిన చివరి సినిమా ఆచార్య.ఇక ఇదంతా లాభం లేదు అని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చిత్రం కిసి కి భాయ్ కిసి కి జాన్, రోహిత్ శెట్టి సర్కస్ మూవీ లో నటించిన ఇవి రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Telugu Bollywood, Guntur Karam, Koi Ishq, Pooja Hegde, Shahid Kapoor, Tollywood-

ఇక ఇప్పుడు షాహిద్ కపూర్ సరసన కోయి శక్ సినిమా( Koi Shaq ) మరియు రణ్వీర్ సింగ్ తదుపరి సినిమాలో కూడా నటిస్తుంది.ఈ రెండు సినిమాల్లో ఒకటి విజయం సాధించిన ఆమెకు బాలీవుడ్ కొన్ని రోజుల పాటు అండగా నిలుతుంది.మొత్తానికి పూజ హెగ్డే కి తెలుగు సినిమా అవకాశాలు వచ్చిన, రాకపోయినా పెద్దగా నష్టం ఏమి ఉండదు.అందుకే అమ్మడు టాలీవుడ్ కి గుడ్ బై చెప్పినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube