టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎంతో నాజూకుగా ముద్దుగా వుండే నిత్యా మీనన్ ఈ మధ్య కాలంలో కాస్త బొద్దుగా తయారైందని చెప్పవచ్చు.
కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ నైపుణ్యం ఉన్న కథలను ఎంపిక చేసుకుని హిట్లు ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నిత్యా మీనన్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమయంలో ఈమె పూర్తిగా తన శరీరం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన ముందు రూపం రావడం కోసం ఎంతో కష్టపడుతున్నానని ఈమె తెలియజేశారు.చాలామంది ఆమె శరీరంలో కొవ్వు కరగడం కోసం ఆపరేషన్ చేయించుకోమని సలహాలు ఇచ్చారని అయితే ఆ పద్ధతి తనకు నచ్చకపోవటం వల్ల నిపుణుల సమక్షంలో డైట్ ఫాలో అవుతూ నిరంతరం వ్యాయామాలు వాకింగ్ చేస్తూ నాజూకుగా మారడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని తెలియజేశారు.
గత ఐదు నెలల నుంచి కఠినమైన డైట్ ఫాలో అవుతూ సుమారు ఆరు కిలోల వరకు బరువు తగ్గినట్లు ఈమె తెలియజేశారు.అయితే తన ప్రయత్నం ఇంతటితో ఆగదని నా పాత స్లిమ్ లుక్ వచ్చేందుకు కష్టపడుతూనే ఉంటానని ఈ సందర్భంగా నిత్యామీనన్ చెప్పుకొచ్చారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే గతేడాది స్కైలాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా నిరాశ పరిచింది.ఇక పవన్ కళ్యాణ్ సరసన ఈమె భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది
.