సౌత్ ఇండియాలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్లలో నిత్యామీనన్( Nithya Menon ) ఒకరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ, ఎన్టీఆర్, మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించి తన అద్భుతమైన నటనతో నిత్యామీనన్ మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా నిత్యామీనన్ ఇంట్లో విషాదం చోటు చేసుకోగా ఆ విషాదం గురించి తెలిసి అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ఫీలవుతున్నారు.
నిత్యామీనన్ అమ్మమ్మ( Nithya Menon Grandmother ) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.
అమ్మమ్మ మరణం గురించి నిత్య స్పందిస్తూ ఒక శకం ముగిసిందని అమ్మమ్మను చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు.గుడ్ బై అమ్మమ్మ మరియు చెర్రీ మ్యాన్.ఇప్పటినుంచి మరో కోణంలో చూసుకుంటానంటూ నిత్యామీనన్ ఎమోషనల్ అయ్యారు.నిత్యామీనన్ అమ్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యామీనన్ ప్రయాణం మొదలైంది.

తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన నిత్యామీనన్ ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.వరుస విజయాల వల్ల నిత్య కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.మలయాళంలో కూడా నిత్యామీనన్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించారు.
కెరీర్ విషయంలో నిత్యామీనన్ ఆచితూచి అడుగులు వేశారు.నిత్యామీనన్ కు తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలు దక్కాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిత్యామీనన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.నిత్యామీనన్ రెమ్యునరేషన్( Nithya Menon Remuneration ) ప్రస్తుతం 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.కొన్ని సినిమాలలో గ్లామరస్ రోల్స్ లో కూడా నిత్యామీనన్ నటించారు.ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించడం లేదనే సంగతి తెలిసిందే.కెరీర్ విషయంలో నిత్యామీనన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.







