Venu : 200తో హైదరాబాద్ కు వచ్చాను.. ఎన్నో కష్టాలు పడ్డాను.. డైరెక్టర్ వేణు ఎమోషనల్?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ వేణు( Venu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీమ్ లీడర్ గా చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు వేణు.

 Balagam Director Venu Yeldandi Shares Interesting Facts About His Personal And-TeluguStop.com

ఆ తర్వాత కాలంలో వేణు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసాడు.అలా చిన్న చిన్నగా వెండితెరపై చిన్న చిన్న అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయాడు.

ఇక జబర్దస్త్ ను వదిలేసిన తర్వాత ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయాడు వేణు.ఆ తర్వాత మళ్లీ జీ తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది షో తో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు.

Telugu Balagam, Dil Raju, Hyderabad, Jabardasth, Tollywood, Venu Yeldandi-Movie

ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న వేణు ఇటీవలే బలగం సినిమాతో తన సినిమా గురించి తన గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రముఖులు మాట్లాడుకునేలా చేశారు వేణు.బలగం సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా ముందు వరకు కేవలం కమెడియన్ గానే ప్రేక్షకులకు సుపరిచితం అయిన వేణు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు.బలగం( Balagam movie ) సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ అతను తీసిన బలగం పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

అంతర్జాతీయంగా వందకు పైగా అవార్డులు సొంతం చేసుకుంది.

Telugu Balagam, Dil Raju, Hyderabad, Jabardasth, Tollywood, Venu Yeldandi-Movie

తెలంగాణ పల్లెల్లో తెరలు ఏర్పాటు చేసుకుని మరీ ఈ సినిమాను వీక్షించారంటే బలగం ప్రేక్షకులకు ఎంతలా కనెక్టయ్యిందో ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు.ప్రస్తుతం తన రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు వేణు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.నేను 1999లో కేవలం రూ.200 తో హైదరాబాద్‌( Hyderabad) కు వచ్చాను.ఆ తరువాత ఎన్నో కష్టాలు పడ్డాను.

కానీ ఎప్పుడు కూడా నా ఏకాగ్రతను కోల్పోలేదు.సినిమాలు తీయాలన్నదే నా ఏకైక లక్ష్యం.

నేను చూడడానికి బాబు మోహన్‌ లా ఉన్నాడని అనడంతో మొదట్లో కమెడియన్‌ అయ్యాను.ఇక జబర్దస్త్‌ షో వదిలేశాక సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు.

ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.అయితే అప్పుడే సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్‌ చేయాలనుకున్నాడు.బలగం సినిమా అలా పుట్టిందే.2011లో నాన్న చనిపోయినప్పుడు సరైన సమయం లేక అన్ని ఆచారాలను చేయలేకపోయాను.బలగం సినిమా కథ రాస్తున్నప్పుడు ఈ విషయం నాకు గుర్తొచ్చింది.అలాగే నాకు బాగా తెలిసిన ఒక ఫ్రెండ్‌ కూడా ఆ ఆచారాల గురించి చర్చించడంతో ఆ అంశంపైనే కథ రాసి సినిమా తీశాను అని చెప్పుకొచ్చాడు వేణు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube