సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక హీరో కి హీరోయిన్ కి మధ్యన రూమర్స్ ఉండడం కొత్తేమి కాదు.పెద్ద ఎన్టీఆర్ కాలం నుండి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం.
ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి రూమర్స్ ఏ రేంజ్ కి చేరాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వెబ్ సైట్స్ , యూట్యూబ్ చానెల్స్ ఇలా ప్రతీ సోషల్ మీడియా మాధ్యమం ఉండడం తో ఇలాంటి గాలి వార్తలకు హద్దు అదుపు లేకుండా పోయింది.
ఒకే వయస్సు ఉన్న హీరో హీరోయిన్లకు సంబంధం అంటగట్టినా ఒక అర్థం ఉంది.కానీ వేరు వేరు వయస్సు ఉన్నవాళ్లకు కూడా సంబంధం అంటగట్టేస్తున్నారు.
ఉదాహరణకి తమిళ హీరో ధనుష్( Dhanush ) మరియు సీనియర్ హీరోయిన్ మీనా కి( Meena ) లింక్ పెట్టేసారు.ధనుష్ వయస్సు 40 ఏళ్ళు, మీనా వయస్సు 47 ఏళ్ళు.
పక్క పక్కన హీరో హీరోయిన్లుగానే ఊహించుకోలేం కానీ, వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు పుట్టించారు.
ధనుష్ తన భార్య ఐశ్వర్య తో( Aishwarya ) విడిపోయాడు, మరో పక్క మీనా భర్త విద్యాసాగర్( Vidya Sagar ) అనారోగ్యం తో చనిపోయాడు.వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని సోషల్ మీడియాలో ఒక వార్త పుట్టించారు.అది తెగ వైరల్ గా మారింది.
ఈ విషయం మీనా కుటుంబం వరకు చేరడం తో ఇది నిజమా అని మీనా ని అడిగారట.అసలు ధనుష్ అనే అబ్బాయి తో నేను రెండు మూడు సార్లు కూడా మాట్లాడింది లేదు.
అలాంటి వ్యక్తి తో నాకు సంబంధం అంటగడితే మీరెలా నమ్మారు అని మీనా బాధపడింది అట.కేవలం మీనా మాత్రమే కాదు, కుటుంబం లో అందరూ కూడా ఈ వార్త చూసి బాదపడ్డారట.ఇది రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీనా చెప్పుకొచ్చింది.ఇలా మనుషుల్ని బాధపెట్టి సంపాదించే డబ్బుతో వాళ్ళు అన్నం కూడా తినలేరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.
ఇదంతా పక్కన పెడితే భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన మీనా, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తుంది.పలు సినిమాలకు ఆమె కమిట్మెంట్స్ కూడా ఇచ్చేసింది అట.ఆమె చివరి సారిగా నటించిన తెలుగు సినిమా ‘దృశ్యం 2’.( Drushyam 2 ) విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ఈ సినిమా కరోనా విలయతాండవం ఆడుతున్న రోజుల్లో డైరెక్ట్ ఓటీటీ లో విడుదలైంది.
ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.