మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ సైతం దక్కించుకున్న మళయాళ భామ కీర్తి సురేష్ ఇన్నాళ్లు తన అభినయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.అయితే కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ వస్తే ఇక్కడ ఎక్కువ రోజు ఉండటం కష్టమని భావించింది కాబోలు అందుకే అమ్మడు చిన్నగా గ్లామర్ రోల్స్ కూడా చేసేస్తుంది.
స్టార్ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ సైడ్ కూడా ఉండాల్సిందే.ఈ క్రమంలో కీర్తి సురేష్ కూడా గ్లామర్ షో చేసేందుకు సై అంటుంది.
ఓ పక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే మరోపక్క స్టార్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంది.లేటెస్ట్ గా ఓ ప్రైవేట్ ఆల్బం సాంగ్ తో కూడా వచ్చింది కీర్తి సురేష్.
ఇప్పటివరకు నటనతో మెప్పించాలని చూసిన కీర్తి సురేష్ ఇక మీదట స్కిన్ తో కూడా ఆకట్టుకోవాలని ఫిక్స్ అయ్యింది.అందుకే అమ్మడు ఈమధ్య ఫోటో షూట్స్ లోనూ, ఈవెంట్స్ లోనూ గ్లామర్ లుక్ తో కనిపిస్తుంది.
మరి కీర్తి సురేష్ ఇస్తున్న ఈ హింట్ తో ఆమెలోని గ్లామర్ యాంగిల్ డైరక్టర్స్ వాడుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుంది.