అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ కపూర్ అతి త్వరలో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారని తారక్ కు జోడీగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకోనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.జాన్వీ కపూర్ భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినా ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
అయితే తాజాగా జాన్వీ కపూర్ రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలో జాన్వీ ధరించిన డ్రెస్ ధర ఏకంగా 72 వేల రూపాయలు కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
సెలబ్రిటీలు డ్రెస్ ల కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేస్తారా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్ తర్వాత ప్రాజెక్ట్ లు ఏ విధంగా ఉండబోతాయో చూడాలి.జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు చేసినా అక్కడ ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు.జాన్వీ కపూర్ కథల ఎంపికలో ఇతర హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం అందుతోంది.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తుండటం గమనార్హం.
వరుసగా విజయాలను సొంతం చేసుకునే విషయంలో చాలామంది హీరోయిన్లు తడబడుతున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల మినహా వరుసగా విజయాలను అందుకుంటున్న హీరోయిన్ లేరనే చెప్పాలి.తారక్ జాన్వీ జోడీ బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.
మరికొన్ని రోజుల్లో కొరటాల తారక్ మూవీ షూట్ మొదలుకానుండగా ఆ సమయానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ రానుంది.