కరోనా విజృంభన తర్వాత చాలామంది ఇంటి వద్ద ఉండి ల్యాప్‌టాప్‌ల ద్వారా పని చేయడానికి అలవాటు పడ్డారు.ఇప్పటికీ చాలామంది ల్యాప్‌టాప్‌లోనే తమ పనులన్నీ చేసుకుంటున్నారు.
అయితే ఇంతకుముందు కంటే ఎక్కువ మంది ల్యాప్‌టాప్ బ్యాటరీతో సమస్యలను ఎదుర్కొంటారు.దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
వాటిలో గంటలకొద్దీ నిరంతర వినియోగం ఒకటని చెప్పవచ్చు.
ల్యాప్‌టాప్‌ల వినియోగం అందులోని కాంపోనెంట్స్ అరిగిపోతాయి.
దీనివల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతూ వస్తుంది.అందుకే ఓల్డ్ ల్యాప్‌టాప్‌లలో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండదు.
అలానే కొన్ని అజాగ్రత్తల వల్ల కూడా బ్యాటరీ డామేజ్ అవుతూ ఉంటుంది.ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, బ్యాటరీ లైఫ్ కాపాడుకునేందుకు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ అంటే బ్యాటరీ లైఫ్‌కి సంబంధించిన హెల్త్ చెకప్ని నిర్వహించాల్సి ఉంటుంది.
అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు మీ ల్యాప్‌టాప్‌లో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నట్లయితే.బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకోడానికి సిస్టమ్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను తెరవాలి.విండోస్ సెర్చ్ లేదా స్టార్ట్ మెనూలో ‘cmd’ లేదా ‘కమాండ్ ప్రాంప్ట్’ టైప్ చేసి ఎంటర్ కొట్టాలి.
అప్పుడు C : డ్రైవ్ కనిపిస్తుంది.ఈ విండోలో powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి.
అప్పుడు మీకు బ్యాటరీ లైఫ్ టైమ్ రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది.దానిపై క్లిక్ చేయడం బ్యాటరీ రిపోర్ట్‌ను పొందవచ్చు.అలానే యూజర్ ఫోల్డర్‌కి వెళ్లి C:Users[Your_User_Name]battery-report.html అని టైప్ చేయడం ద్వారా బ్యాటరీ రిపోర్ట్ అందుకోవచ్చు.
ఆపై చెక్ చేసుకుని మీరు మీ బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు.బ్యాటరీ హెల్త్ తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మీరు కేర్ తీసుకోవచ్చు.