దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ముద్దుగుమ్మ హన్సిక.ఈ అమ్మడు దాదాపు 5 నుండి 6 సంవత్సరాల పాటు తెలుగు లో వరుసగా సినిమాలను చేసింది.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి.కానీ కోలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది.
మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడం కోసం ఈ అమ్మడు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.అందులో భాగంగానే ఈమె తెలుగు ప్రేక్షకులకు నచ్చాలి అనే ఉద్దేశంతో బాగా సన్నబడింది.
అది ఎంతగా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా బాబోయ్ మరి ఇంత సన్నగా ఏంటి అన్నట్లుగా సన్నబడింది.
తెలుగు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న హన్సిక ఇప్పుడు చూడడానికి అసలు గుర్తు పట్టనంతగా మారింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
దేశ ముదురు సినిమా లో ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్న హన్సిక ఇప్పుడు ఇలా సన్నగా పీలగా అయ్యి ఫేస్ లో గ్లో పోయింది అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కాస్త వెయిట్ పెంచితే నీ అందం ముందు అందరూ దిగదుడుపే అంటూ హన్సిక అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరి హన్సిక మళ్లీ తన వెయిట్ పెంచుకుంటుందా లేదంటే ఇదే వెయిట్ తో సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందా అనేది చూడాలి.ఈ అమ్మడు తమిళం లో చేసిన సినిమాలు తెలుగు లో డబ్ అవుతూనే ఉన్నాయి.
కనుక ఏదో ఒక సందర్భం లో తెలుగు నుండి ఆఫర్ రావడం ఖాయం ఆ సందర్భం కోసం ఆమె ఎదురు చూడడం తో పాటు ఆమె అభిమానులు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు.