టాలీవుడ్ హీరోయిన్ హన్సిక తాజాగా నటించిన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి( My Name Is Shruthi ).పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా హైదరాబాదులో విలేకరులతో ముచ్చటించిన హన్సిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా హీరోయిన్ హన్సిక( Hansika ) మాట్లాడుతూ… ఇది ఒక మంచి డార్క్ థ్రిల్లర్.ఇలాంటి నేపథ్యంలో సినిమా చేయడం నాకు ఇదే మొదటి సారి.
మనం ఇప్పటి వరకు ఆడవాళ్లు – చిన్నపిల్లల అక్రమ రవాణాల గురించే విన్నాం.కానీ, దీంట్లో మనుషుల చర్మం అక్రమ రవాణా అనే ఒక కొత్త క్రైమ్‌ను టచ్ చేశారు.
ఇదెలా చేస్తారు? ఎందుకు చేస్తారు? దీని వెనకున్న మాఫియా ఎలా పని చేస్తుంది? అన్నది ఆసక్తికరం.దర్శకుడు శ్రీనివాస్ తొలిసారి ఈ కథ వినిపించినప్పుడు ఇలాంటి క్రైమ్ కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యం కలిగింది.
మా అమ్మ డెర్మటాలజిస్ట్ కావడంతో వెంటనే తనని స్కిన్ మాఫియా ఉందా అని అడిగాను.తను ఎక్కడో ఇలాంటి క్రైమ్ జరిగినట్లు చదివానని చెప్పింది అని తెలిపింది హన్సిక.అనంతరం సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను యాడ్ ఏజెన్సీ లో పనిచేసే శృతి అనే ఒక యువతి పాత్రలో నటించాను.ఆమె ఒక పోరాట యోధురాలు తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ.
ఏ విషయానికి కూడా వేడకడుగు వేయదు.ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది.
అలాంటి ఆమెకు ఒక భయంకరమైన అధిగమించలేని సమస్య ఎదురవుతుంది.స్కిన్ మాఫియా ట్రాప్‌లో చిక్కుకుంటుంది.
మరి దాని నుంచి శృతి ఎలా బయటపడింది? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? అన్నది అసలి కథ.ఊహించని ట్విస్టులతో ఆద్యంతం థ్రిల్ పంచుతూ సాగుతుందీ.ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
నిజానికి ఇలాంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ సినిమా చేయడం చాలా సవాల్‌తో కూడుకొని ఉంటుంది.ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొన్నారు.ఈ మధ్యే ఈ చిత్ర ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్నాం.
ఇంత మంచి థ్రిల్లర్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా అనిపించింది.అలాగే నేను కొన్నేళ్లుగా తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది.
నా 20ఏళ్ల సినీ కెరీర్ విషయంలో ఎప్పుడు ఏ గురించి బాధపడలేదు.అవకాశాలు ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ ఒకేలాగా ఉంటాను.
నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను.భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది.
నా కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్, ప్రభాస్( Allu Arjun, Prabhas ) లతో కలిసి పని చేసినందుకు గర్వపడుతున్నాను.వారి సినిమాలిప్పుడు సరిహద్దుల్ని చెరిపేస్తూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాయి.
వారి కష్టానికి ఆ గుర్తింపు అర్హమైనదని భావిస్తాను.వాళ్లు ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం అంటూ ప్రభాస్ అల్లు అర్జున్ లపై ప్రశంసలు కురిపించింది హన్సిక.