Chandni : అవి విసిరేసి ప్రాణాలు కాపాడుకున్నా.. వాష్ రూమ్స్ లేవని నీళ్లు తాగలేదు.. చాందిని కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి చాందిని ( Actress Chandni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కలర్ ఫోటో సినిమాతో( color photo film ) భారీగా పాపులారిటీని సంపాదించుకుంది చాందిని.

 Heroine Chandini Chowdary Comments Viral On Social Media-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఏ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం గామి.

విశ్వక్సేన్ ( Visvaksen )హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 8 న థియేటర్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా విలేకరులతో ముచ్చటించారు మూవీ మేకర్స్.

ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.

Telugu Actress Chandni, Tollywood-Movie

మను చిత్రం చేస్తున్నప్పుడు దర్శకుడు విద్యాధర్‌( Directed Vidyadhar ) పరిచయమయ్యారు.అప్పుడే ఈ గామి గురించి చెప్పారు.చాలా విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో తీసిన సినిమా ఇది.దీని వల్లే చిత్రీకరణకు చాలా ఎక్కువ సమయం పట్టింది.అందువల్లే విజువల్స్‌ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి.ఐమాక్స్‌ స్క్రీన్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ చూసినప్పుడు మేము పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి.

ఈ చిత్రంలో నా పాత్ర.విశ్వక్ పాత్రకు సంబంధించిన కథలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.

మరి మా ఇద్దరి లక్ష్యాలు ఎలా ఒక్కటయ్యాయో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

Telugu Actress Chandni, Tollywood-Movie

ఈ చిత్ర క్లైమాక్స్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది.నాకు తెలిసి ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటి వరకు రాలేదు.ఇది విజయవంతమైతే ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు తెరపైకి వస్తాయి.

ఈ చిత్ర ప్రయాణమంతా ఓ సాహస యాత్రలా జరిగింది.నేను ఈ ప్రాజెక్ట్‌లో మొదటి రోజు నుంచి ఉన్నాను.

దీని చిత్రీకరణ వారణాసి, కశ్మీర్‌, హిమాలయాలు.ఇలా ఎన్నో రియల్‌ లొకేషన్స్‌లో జరిగింది.కుంభమేళలో అఘోరాల మధ్య కూడా చిత్రీకరణ జరిపాం.ముఖ్యంగా హిమాలయాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం.మా టీమ్‌ మొత్తంలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని.అందరం ఒకే బస్సులో హిమాలయాల్లోకి వెళ్లి సూర్యాస్తమయం వరకు చిత్రీకరణ చేసి వచ్చే వాళ్లం.

అక్కడ వాష్‌ రూమ్స్‌ లాంటివి ఉండవు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు కూడా తాగేదాన్ని కాదు.అలా నెల రోజులు షూట్‌లో పాల్గొన్నాను.

గడ్డ కట్టిన నదిపై చిత్రీకరణ జరుపుతున్నప్పుడు మంచు ఫలకాల మధ్య పగుళ్లు ఏర్పడి నదిలో పడే పరిస్థితి ఎదురైంది.ఆ సమయంలో నా దగ్గర ఉన్న బరువైన లగేజ్‌ను దూరంగా విసిరేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకు దూకా.

ఇలా చిత్రీకరణ ఆద్యంతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది చాందిని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube