నా క్యారెక్టర్ చుట్టూ 'టెన్త్ క్లాస్ డైరీస్' తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి - అవికా గోర్ ఇంటర్వ్యూ

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’.అచ్యుత రామారావు .

 Heroine Avika Gor Full Interview Tenth Class Diaries Movie Details, Heroine Avik-TeluguStop.com

పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు.అజయ్ మైసూర్ సమర్పకులు.

ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా అవికా గోర్‌తో ఇంటర్వ్యూ…

ప్రశ్న: హాయ్ అవికా గోర్! ఎలా ఉన్నారు?

అవికా గోర్: ఐయామ్ గుడ్.చాలా బావున్నాను.త్వరలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను.

ప్రశ్న: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ గురించి చెప్పండి… సినిమా ఎలా ఉండబోతోంది?

అవికా గోర్: ఇదొక స్వీట్ మూవీ.మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే… రీ యూనియన్ అయితే… ఎలా ఉంటుందనేది చూపించారు.రీ యూనియన్ ఒక్కటే కాదు.సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది.ఇంకా ఇందులో లిటిల్ బిట్ డ్రామా, ఫ్లాష్‌బ్యాక్‌, కామెడీ ఉంటుంది.

ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు.నేను ఎంపిక చేసుకునే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను.ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది.

ప్రశ్న: టెన్త్ క్లాస్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి?

అవికా గోర్: సినిమా షూటింగ్స్! ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ… మరో వైపు షూటింగ్స్ చేశా.నేను స్కూల్‌కు వెళ్ళింది తక్కువ.

లొకేషన్స్‌లో, సెట్స్‌లో ఉన్నది ఎక్కువ.

Telugu Anvitha Avani, Avika Gor, Avikagor, Garudavega Anji, Sri Ram, Tenth Class

ప్రశ్న: మీ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయా? ఒక్కటేనా?

అవికా గోర్: ఐ డోంట్ నో! నాకు తెలియదు.మీరు సినిమా చూసి తెలుసుకోవాలి (నవ్వులు).సినిమా నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది.

అందులో చాలా సస్పెన్స్ ఉంది.సినిమాలో నా పాత్ర పేరు చాందిని.

ఆమె ఎక్కడ ఉంది? చాందిని ఏం చేస్తుంది? బతికుందా? లేదా? అని తెలుసుకోవాలని క్లాస్‌మేట్స్‌ ప్రయత్నిస్తారు.చాలా సస్పెన్స్ అన్నమాట.మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్రశ్న: నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ గురించి…

అవికా గోర్: వెరీ నైస్ పీపుల్.వాళ్ళ నిర్మాణంలో కంఫ‌ర్ట్‌బుల్‌గా ఫీలయ్యాను.మేం చాలా లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు.నేను చిక్ మంగుళూరులో చేశా.అయితే, సినిమాను శ్రీలంక, రాజమండ్రి, ఇంకా చాలా లొకేషన్స్‌లో చేశారు.

ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు.

అంత మందితో సినిమా తీయడం ఎంత కష్టమో నిర్మాతగా నాకు తెలుసు.

Telugu Anvitha Avani, Avika Gor, Avikagor, Garudavega Anji, Sri Ram, Tenth Class

ప్రశ్న: మీ మీద ఒక పాట తెరకెక్కించారు.సినిమాలో పాటల గురించి…

అవికా గోర్: ఏ సినిమాకు అయినా సరే పాటలు చాలా ముఖ్యం.ఎంతో వేల్యూ యాడ్ చేస్తాయి.

సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు.ఆల్రెడీ పాటలు ప్రేక్షకులు నచ్చాయి.

నార్త్ ఇండియాలో నా ఫ్రెండ్స్ కూడా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ పాటలు వింటున్నారు.హార్ట్ టచింగ్ సాంగ్స్ అని చెబుతున్నారు.

ప్రశ్న: నటుడు శ్రీరామ్ గురించి…

అవికా గోర్: అమేజింగ్ యాక్టర్.మా మధ్య ఎక్కువ సీన్స్ లేవు.అయితే… ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను.ఆయన ఎక్స్‌పీరియ‌న్స్‌లు చెప్పారు.

ప్రశ్న: ఎవరితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి?

అవికా గోర్: నా తండ్రి పాత్రలో నాజర్ గారు నటించారు.ఆయనతో ఎక్కువ సీన్స్ ఉన్నాయి.

సినిమాపై ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంతో నేర్చుకున్నాను.

ప్రశ్న: దర్శకుడు అంజి గురించి…

అవికా గోర్: అంజి గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు.నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో బాగా తెలుసు.

సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా బాగా తీశారు.

Telugu Anvitha Avani, Avika Gor, Avikagor, Garudavega Anji, Sri Ram, Tenth Class

ప్రశ్న: సినిమాలు పక్కన పెట్టి… మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మిళింద్‌తో మీరు ప్రేమలో ఉన్న విషయం తెలుసు.ఆయన పరిచయం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి?

అవికా గోర్: నేను మరింత కాన్ఫిడెంట్‌గా అయ్యాను.నా కేపబిలిటీ ఏంటి అనేది నాకు తెలిసింది.

నేను ఏం చేయగలనో తెలిసింది.నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలని తెలుసుకునేలా చేశాడు.

నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ… నా ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు.నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు.అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను.

ప్రశ్న: తెలుగు సినిమాలకు మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి.మీరేమంటారు?

అవికా గోర్: నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోయా.అంతకు మించి ఏమీ లేదు.డేట్స్ లేక తెలుగు సినిమాలు చేయలేయకపోయా.

ప్రశ్న: జూన్ 30న మీ పుట్టినరోజు.బర్త్ డే ప్లానింగ్స్ ఏంటి?

అవికా గోర్: ప్రస్తుతానికి ఏమీ లేవు.జూలై 1న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదలవుతోంది కదా! వీలైతే ఒక్క రోజు ముందు… నా పుట్టిన రోజున అది చూడాలనుకుంటున్నా.

వచ్చే నెలలో నేను నటించిన ‘థాంక్యూ’ విడుదల కానుంది.ఇంకా తెలుగులో సినిమా చేస్తున్నాను.ఆ సినిమాల గురించి మీకు చెప్పాలనుంది.పుట్టినరోజున అప్‌డేట్స్‌ రావచ్చు.

లెట్స్ వెయిట్ అండ్ వాచ్!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube