ఏదైనా ఇండస్ట్రీలో ఒక కాంబో ఒక్కసారి వచ్చి హిట్ అయితే ఆ కాంబో హిట్ అనిపించు కుంటుంది.ఇక మరో రెండుసార్లు రిలీజ్ అయితే సూపర్ హిట్ కాంబో అని అనిపించు కుంటుంది.
ఇక ఆ హిట్ కాంబో కోసం ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చూస్తుంటారు.అందుకే వారి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు.
అయితే డైరెక్టర్, హీరో కాంబినేషన్ మాత్రమే హిట్ కాంబో కాదు.డైరెక్టర్, హీరోయిన్ కాంబోల్లో కూడా హిట్ కాంబినేషన్ ఉంటుంది.మరి ప్రెజెంట్ సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్-హీరోయిన్ కాంబోలు మరోసారి హిట్ అందుకునేందుకు సిద్ధం అయ్యారు… అందులో త్రివిక్రమ్-పూజా హెగ్డే ఉన్నారు.వీరి కాంబోలో గతంలో అరవింద సమెత, అల వైకుంఠపురములో రాగా రెండు సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి మహేష్ (Mahesh Babu), పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా మరో ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.ఇక మరో హిట్ కాంబో సమంత (Samantha)- శివ నిర్వాణ.ఈ కాంబోలో మజిలీ వంటి సూపర్ హిట్ వచ్చింది.ఇక రెండవసారి విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషి సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం ఇరు వర్గాల ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
అలాగే నాగ్ అశ్విన్ మాళవిక నాయర్ కాంబోలో కూడా రెండు సినిమాలు రాగా రెండు కూడా మంచి విజయం సాధించాయి.ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ కాంబో ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో కూడా ఇప్పుడు ఈమె కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే హిట్ సిరీస్ తో తెరకెక్కించిన శైలేష్ కొలను కూడా రుహానీ శర్మను రిపీట్ చేస్తున్నాడు.