యంగ్ హీరో నిఖిల్( Young Hero Nikhil ) నటించిన లేటెస్ట్ చిత్రం స్పై ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.సినిమాలో బలమైన కంటెంట్ ఉన్నప్పటికీ , డైరెక్టర్ టేకింగ్ సరిగా లేకపోవడం వల్ల ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.
సినిమా ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత కూడా నిఖిల్ ఒపీనియన్ ఇదే.సినిమా ఔట్పుట్ సరిగా రాలేదని, కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేద్దాం, విడుదల తేదీ వాయిదా వెయ్యమని మా నిర్మాతతో గొడవలకు దిగానని, ఎంత చెప్పినా, ఎంత మాట్లాడిన ఆయన తగ్గకపోవడం తో ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నామని చెప్పాడు.ఆయన ఈ మాట అన్నప్పుడే ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఔట్పుట్ పై అనుమానాలు మొదలయ్యాయి.ఆ అనుమానం కి తగ్గట్టుగానే ఈ చిత్రం ఔట్పుట్ ఆశించిన స్థాయిలో రాలేదని చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యింది.
అయితే ఈ సినిమాని తొలుత నిఖిల్ తో చెయ్యాలని అస్సలు అనుకోలేదట ఆ చిత్ర డైరెక్టర్ గ్యారీ BH( Garry BH ).తొలుత ఈ సినిమా స్టోరీ లైన్ ని న్యాచురల్ స్టార్ నాని( Naturalstar Nani ) కి వినిపించాడట.ఆయనకీ స్టోరీ బాగా నచ్చింది కానీ, పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మని చెప్పాడట.స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని వచ్చిన తర్వాత కథ చాలా కంప్లెక్స్ గా ఉంది, వర్కౌట్ అవ్వుద్ది అనిపించడం లేదు, ఇది పక్కన పెట్టి వేరే స్క్రిప్ట్ తో రా, ఏదైనా ఎంటర్టైనర్ ని ప్లాన్ చెయ్యి అన్నాడట.
ఇక ఆ తర్వాత ఇదే కథ ని ప్రముఖ హీరో అడవి శేష్( Hero Adivi Sesh ) కి చెప్పాడు.ఇలాంటి కథలు చెయ్యడానికి అమితాసక్తి చూపించే అడవి శేష్ కూడా ఎందుకో ఒప్పుకోలేదు.
ఇక చివరికి ఈ కథ నిఖిల్ వద్దకు చేరుకుంది.ఆయన తెగ నచ్చేసింది, కానీ ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత టేకింగ్ బాలేదు అని అర్థమై చాలా ఫీల్ అయ్యాడట నిఖిల్.
మొదటి రెండు రోజులకు కలిపి ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబట్టబోతుందో చూద్దాము.ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు ఉన్నాయి.అందులో ‘స్వయంభు'( Swayambhu ) అనే హిస్టారికల్ జానర్ సినిమా కాగా, మరొకటి రామ్ చరణ్ నిర్మాణం లో తెరకెక్కబోతున్న ‘ఇండియా హౌస్’ ( India House )అనే చిత్రం.ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో మామూలు అంచనాలు లేవు.
ముఖ్యంగా రామ్ చరణ్ నిర్మించే ఇండియా హౌస్ అనే చిత్రం ప్రకటన రోజే నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సోషల్ మీడియా ని షేక్ చేసింది.త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది.