కేజిఎఫ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం సమయం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు.
ఈ క్రమంలోనే తన భార్య పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇకపోతే యశ్ భార్య రాధిక సైతం సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.యశ్ కుమారుడు యథర్వ్ బ్రష్ చేయడం కోసం తన తల్లిని ఇబ్బంది పెట్టడంతో యశ్ బ్రష్ చేయాలని తన కొడుకుని మందలించాడు.
ఈ క్రమంలోనే తన కుమారుడు తన తల్లిని హత్తుకొని నాన్న బ్యాడ్ బాయ్ అమ్మ గుడ్ గర్ల్ అంటూ ఎంతో ముద్దుగా చెప్పాడు.తన అమ్మ స్వీట్ అని తన డాడీ బ్యాడ్ బాయ్ అంటూ ఈ సందర్భంగా యశ్ కుమారుడు చెప్పారు.
ఈ క్రమంలోనే ఈ వీడియోని రాధిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నేటింట్లో వైరల్ అవుతుంది.ఈ విధంగా ఈ వీడియో చూసిన ఎంతోమంది అభిమానులు యథర్వ్ సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక యశ్ తన కోస్టార్ రాధికతో ప్రేమలో పడి 2016 వ సంవత్సరంలో పెద్దల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నారు.ఇకపోతే వీరికి ఒక కుమార్తె ఓ కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే తరుచూ వీరికి సంబంధించిన ఫోటోలను రాధిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.