టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క గురించి మనందరికీ తెలిసిందే.అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాక ఇప్పటికీ దాదాపుగా రెండేళ్లు దాటిపోయింది.
చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటించింది.ఆ తర్వాత అనుష్క సినిమాలకు సంబంధించి ఒక కమిట్మెంట్ కూడా లేదు.
అయితే అంతకుముందు భాగమతి, సైరా నరసింహారెడ్డి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.బాగా బాహుబలి సినిమా తర్వాత అనుష్క మరే సినిమా చేయలేదు.
అయితే గడిచిన కొన్ని ఏళ్లలో చూసుకుంటే ఈ విషయం క్లారిటీగా అర్థం అవుతుంది.
అయితే అనుష్క సినిమాల్లో నటించకపోయేసరికి పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాలి.
ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులకు సినిమాలకు గ్యాపు అనుష్క తనకు తానుగా తీసుకుంది అన్న వార్త మరింత హైలైట్ గా నిలిచింది.మరొకవైపు ఏ భాషలో కూడా అనుష్క సినిమాలు చేయకపోవడానికి వ్యక్తిగత కారణాలే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలు నిజానిజాల సంగతి ఏంటి అనేది అర్థం కావడం లేదు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అనుష్క కావాలనే సినిమాల్లో నటించడం లేదా? లేకపోతే అవకాశాలు లేక ఖాళీగా ఉంటుందా?అన్న విషయం అర్థం కావడం లేదు.
కాగా ఇటీవలే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.

పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించి కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే అనుష్క సడన్ గా యంగ్ హీరోతో కమిట్ అవ్వడం వెనుక అంతరార్ధం ఏంటి? అంటూ ఆరాలు మొదలయ్యాయి.అప్పుడు వచ్చిన అవకాశాల్ని కాదనుకుని ఇప్పుడు చిన్న హీరోతో సినిమా చేయడం ఏంటి? అప్పట్లో అవకాశాలు వచ్చిన మాట వాస్తమైనా.ఇప్పుడా ఛాన్సులు ఇంటి తలుపు తట్టని కారణంగానే ఈ ఛాన్స్ కి యస్ చెప్పాల్సి వచ్చిందని కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది.మరి అనుష్క వీటికి ఎలాంటి ముగింపు పలుకుతుంతో చూడాలి మరీ.ప్రస్తుతం అనుష్క బెంగుళూరులో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ, వారితో గడుపుతూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.







