ఖరీదైన కారును కొనుగోలు చేసిన హీరో విశ్వక్ సేన్.. ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ యూత్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటంతో పాటు ఫలక్ నుమా దాస్, హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలతో విజయాలను అందుకున్నారు.పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధించారు.

 Hero Vishwak Sen Fulfilled His Wish Details Here Goes Viral , Vishwak Sen , New Car, 1.5 Crores, Benz G Class 2022 Model, Ashokavanam Lo Arjuna Kalyanam-TeluguStop.com

పలు ఏరియాల్లో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది.

అయితే ఈ యంగ్ హీరో తాజాగా కొత్త కారును కొనుగోలు చేశారు.

 Hero Vishwak Sen Fulfilled His Wish Details Here Goes Viral , Vishwak Sen , New Car, 1.5 Crores, Benz G Class 2022 Model, Ashokavanam Lo Arjuna Kalyanam-ఖరీదైన కారును కొనుగోలు చేసిన హీరో విశ్వక్ సేన్.. ఎన్ని కోట్లంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లగ్జరీ కారును కొనుగోలు చేసిన విశ్వక్ సేన్ ఈ కారు కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని బోగట్టా.విశ్వక్ సేన్ కొనుగోలు చేసిన కారు బెంజ్ జీ క్లాస్ 2022 మోడల్ కారు కాగా నా డ్రీమ్ కారుని నిన్ననే కొనుగోలు చేశానని విశ్వక్ సేన్ తెలిపారు.

అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్ల ఇది సాధ్యమైందని విశ్వక్ సేన్ వెల్లడించారు.

నా లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో సంతోషిస్తున్నానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

ఈ కారు విలువ తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.వరుస విజయాల వల్ల విశ్వక్ సేన్ రేంజ్ పెరుగుతుండగా ప్రస్తుతం ఈ హీరో చేతిలో 5 సినిమాలు ఉన్నాయి.

విశ్వక్ సేన్ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.విశ్వక్ సేన్ అభిమానులు ఆయనకు కొత్త కారు కొనుగోలు చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విశ్వక్ కారు ఫోటోల గురించి స్పందిస్తూ ఆ కారు తనదేనని విశ్వక్ సేన్ ఫోటోలు తీసుకుంటానంటే ఇచ్చానని సరదాగా చెప్పుకొచ్చారు.విశ్వక్ సేన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube