1.ఎన్నారై టిడిపి అభిమానులతో ఆత్మీయ సమావేశం
అనంతపురం అర్బన్ టిడిపి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తో ఆత్మీయ సమావేశం మే 18 న షార్లెట్ నగరం లో వైభవంగా జరిగింది.
2.లండన్ లో కేటీఆర్ కు ఎన్నారై ల ఘన స్వాగతం
యూకే,, స్విజర్లాండ్, పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ కు విమానాశ్రయంలో యూకే లోని టీఆర్ఎస్ విభాగం నేతలు, ఎన్.ఆర్.ఐ సంఘాల సభ్యులు ఘన స్వాగతం పలికారు.
3.ఇద్దరు భారతీయ మిత్రులకు జాక్పాట్
ఉపాధి కోసం అబుదాబి వెళ్ళిన ఇద్దరు భారతీయ ప్రవాసులకు అబుదబి బిగ్ టికెట్ లాటరీలో ఇండియాకు చెందిన డియోనా అన్నా బిను షరీఫ్, పనిచాయల్ 5 లక్షల దిర్హంస్ గెలుచుకున్నారు.
4.సౌదీ అరేబియా మరో కీలక నిర్ణయం
వీసాల జారీ విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది.ఇక పై యూనిఫైడ్ నేషనల్ ప్లాట్ ఫామ్ గా మారనుంది.ఈ మేరకు సౌదీ కేబినెట్ ఆమోదించింది.
5.పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఫామ్ ఆయిల్ ఎగుమతులపై గత ఏప్రియల్ నెలలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇండోనేషియా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
6.దలైలామా కీలక వ్యాఖ్యలు
టిబెటన్ల ను మార్చడం చైనా వల్ల కావడం లేదని టిబెటన్ ల మతగురువు దలైలామా అన్నారు.
7.ఎలెన్ మాస్క్ తీరు పై ట్విట్టర్ ఆగ్రహం
ట్విట్టర్ ను కొనుగోలు చేయడం వల్ల లాభం ఏంటి అనే ఆలోచనతో ఉన్న ఎలెన్ మాస్క్ తీరు పై ఆ సంస్థ ఆగ్రహం గా ఉంది.
ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే మూడున్నర లక్షల కోట్లు ఇవ్వాలి.ఒకవేళ ఒప్పందం నుంచి తప్పుకుంటే ఏడున్నర వేల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
8.పాక్ పై అమెరికా సంచలన ఆరోపణలు
అణ్వాయుధాల ను భారీగా పెంచుకునే ఆలోచనలో పాకిస్థాన్ ఉన్నట్టు అమెరికన్ ఇంటిలిజెన్స్ గుర్తించింది .
9.అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం
అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం సృష్టించింది.బ్రిటన్ లో నమోదయిన మంకీ ఫాక్స్ కేసు అమెరికాలోనూ నమోదయ్యింది.
10.ఉత్తర కొరియాలో కరోనా కలకలం
ఉత్తర కొరియాలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రతరం అవుతుండడం తో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.ఆంక్షలను మరింత కఠిన తరం చేసింది.