యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు పలు కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం ఉదయం 11 గంటలకు బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్ని సందర్శిస్తారు.తర్వాత ఉదయం 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీ డయాగ్నస్టిక్ సెంటర్ పనులకు శంకుస్థాపన చేసి.32 పడకల డిపిసియు, 20 పడకల ఎస్.ఎన్.సి.యు.కేంద్రాలకు ప్రారంభోత్సవం చేస్తారని ఆమె తెలిపారు.మధ్యాహ్నం 12.15 గంటలకు స్థానిక విద్యానగర్ నందు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది,గైనకాలజిస్టులు,ఆర్థోపెడిక్ వైద్యులు,డ్రగ్ కంట్రోల్,ఆహార భద్రత,ట్రెజరీ,ఆడిట్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.తదుపరి కలెక్టరు కార్యాలయంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రయివేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులతో సమీక్ష నిర్వహిస్తారు.అనంతరం సాయంత్రం 2:30 గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరి వెళతారని తెలిపారు.







