నటుడు విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా త్వరలోనే సైందవ్ (Saindhav) సినిమా ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ ఇతర చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ మీడియా సమావేశంలో భాగంగా విక్టరీ వెంకటేష్ కి తన కుమారుడు అర్జున్(Arjun) సినిమా ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే .అయితే తన కుమారుడు ఇండస్ట్రీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే విషయం గురించి అభిమానులు తరచూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా ప్రతినిధుల నుంచి వెంకటేష్ కి ఈ ప్రశ్న ఎదురయింది.

మీ అబ్బాయి అర్జున్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది సర్ అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా దానికి వెంకటేష్ సమాధానం చెబుతూ వాడు ఎక్కడో చదువుకుంటున్నాడు అంటూ చాలా ఫన్నీగా సమాధానాలు చెప్పారు.అందరూ మీ అబ్బాయి ఎంట్రీ గురించి అడుగుతున్నారు అంటూ మరోసారి ప్రశ్న వేయడంతో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ముందు చదువుకోండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటూ ఈ సందర్భంగా వెంకటేష్ సమాధానం చెప్పారు.అయితే ప్రస్తుతం తన కొడుకు ఉన్నత చదువులు నిమిత్తం విదేశాలలో చదువుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.
ఈయన మాటలు బట్టి చూస్తే తన కొడుకు చదువులు పూర్తి అయిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.







