పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న హీరో తరుణ్...అసలు ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రత్యేకతలు సంపాదించుకొని ఎన్నో ప్రేమ కథ సినిమాలలో హీరోగా ఓ వెలుగు వెలిగినటువంటి నటుడు తరుణ్(Tarun ) ఒకరు.

ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా లవర్ బాయ్ గా( Lover Boy ) ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో తరుణ్ కి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.

ఈయన మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటే ఇదివరకు వార్తలు వచ్చాయి.

అదేవిధంగా ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది హీరోయిన్లతో ప్రేమ ప్రయాణాలు చేశారని అయితే అవి వర్కోట్ కాకపోవడం ఇప్పటివరకు జీవితంలో సింగిల్ గా ఉన్నారని తెలుస్తుంది.ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి తరుణ్ త్వరలోనే పెళ్లి( Tarun Marriage ) చేసుకోబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.పెళ్లి చేసుకోకుండా తండ్రీ కావడం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే ఈయన జీవితంలో కాకుండా తిరిగి సినిమాలలోకి రాబోతున్నారని ఆ సినిమాలో ఒక అమ్మాయికి తండ్రి పాత్రలో( Father Role ) నటించబోతున్నారని సమాచారం.

తరుణ్ త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్(Second Innings) ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అయితే ఈయన ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోకి తమ్ముడి పాత్రలో నటించబోతున్నారని ఈ సినిమాలో ఈయనకు జోడిగా మీరా జాస్మిన్(Meera Jasmine) నటించబోతున్నారని తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో తరుణ్ కి ఆరు సంవత్సరాల కుమార్తె ఉంటుందని , చిన్నారికి తండ్రి పాత్రలో తరుణ్ నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా నిజ జీవితంలో సింగిల్గానే ఉన్నప్పటికీ సినిమాలలో మాత్రం ఈయన తండ్రిగా నటించబోతున్నారని వార్త తెలియడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ హీరోగా నటించకుండా ఇలా తండ్రి పాత్రలలో నటించడం ఏంటి అంటూ కూడా పలువురు ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు