టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి మనందరికీ తెలిసిందే.Bహీరోగా ఇదివరకు సినిమాలలో నటించి మెప్పించిన సుశాంత్ మా నీళ్ల ట్యాంక్ అనే ఒక వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
సుశాంత్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టాడు.మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్.
ఈ వెబ్ సిరీస్‌ను లేడీ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు.ఇందులో ఒకప్పటి హీరోయిన్ ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది.
అలాగే ఇందులో సుదర్శన్, ప్రేమ్ సాగర్, బిగ్‌బాస్ ఫేమ్ దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రల్లో నటించారు.
కాగా ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో నేడు అనగా జులై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యాంకర్‌పై హీరో సుశాంత్ ఫైర్ అయ్యాడు.సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా? మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు.వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను.మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌లో మంచి కంటెంట్ ఉందా? లేదా? అనేది చూశాక మాట్లాడు అంటూ యాంకర్ పై అసహనం వ్యక్తం చేశాడు హీరో సుశాంత్.అయితే ఇదంతా నిజంగా కాదులేండి.

ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో సుశాంత్, నటుడు, కమెడియన్ సుదర్శన్ సరదాగా ఓ స్కిట్ చేశారు.ఇందులో కమెడియన్ సుదర్శన్, హీరో సుశాంత్‌ను ఇంటర్వ్యూ చేసే యాంకర్‌గా స్టేజ్‌పైకి వచ్చి సందడి చేశాడు.ఈ క్రమంలో వెబ్ సిరీస్ గురించి సుశాంత్ చెబుతుంటే మనలో మన మాట సినిమాల్లేవా అని సుదర్శన్ ప్రశ్నించడంతో సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది.చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్? కంటెంట్ ఉందో లేదో సిరీస్ చూస్తేనే తెలుస్తుంది అని కోపంతో సమాధానమిచ్చాడు సుశాంత్.అయితే దీనికి సంబంధించిన వీడియోను సుశాంత్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది.







