జబర్దస్త్ వెంకీ లవ్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే.. స్టేజిపైనే అలా చెయ్యడంతో షాక్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ వెంకీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమెడియన్ గా అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా వెంకీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Comedian Venky Introduced His Wife In Anasuya Jabardasth Show Latest Promo Comed-TeluguStop.com

జబర్దస్త్ షోలో వెంకీ మంకీ అని టీమ్ లో తనతో పాటుగా పలువురు ఆర్టిస్టులతో కలిసి వరుసగా పంచులు వేస్తూ ప్రేక్షకులు నవ్విస్తూ ఉంటాడు.కమెడియన్ గా కంటే మిమిక్రీ ఆర్టిస్ట్ గానే వెంకి బాగా పాపులర్ అయ్యాడు.

ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా అందులో వెంకీ తన భార్యను అందరికీ పరిచయం చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే.

తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్ గా అనసూయనే కొనసాగుతోంది.

ఈ క్రమంలోని మొదట కమెడియన్ చలాకి చంటి పాత సినిమాల బ్యాక్‌డ్రాప్‌లో లైన్ తీసుకుని తనదైన శైలిలో యాక్టింగ్ అదరగొట్టేడమే, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

అనంతరం రివ్యూయ‌ర్ ల‌క్ష్మణ్ పెళ్లికి ముహుర్తం పెట్టడంతో.పెళ్లి మానుకుని రివ్యూ చెప్పేందుకు వెళ్లడం నవ్వులు పూయిస్తోంది.అనంతరం కమెడియన్ వెంకీ తన భార్యను అందరికీ పరిచయం చేశాడు.ఎన్నెన్నో జన్మల బంధం అంటూ సతీమణితో కలిసి స్టెప్పులు వేశాడు.

ఇక స్కిట్ అయిపోయిన తరువాత తనది లవ్ మ్యారేజ్ అని మొదట నేనే ప్రపోజ్ చేశాను అని చెప్పుకొచ్చాడు.తాను మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే తన భార్య కూచిపూడి డ్యాన్సర్ అని అvన్నాడు.

ఈ సందర్భంగా వెంకీ భార్య ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.స్టేజ్‌పైనే అందరి ముందు మోకాలి పై కూర్చొని పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వేరేలవుతుంది.అలాగే ఈ ప్రోమోలో నటి ఇంద్రజ కూడా తన లవ్ మ్యారేజ్ గురించి చెప్పుకొచ్చింది.అలాగే జెడ్జ్ మనో ని లవ్ మ్యారేజా అని అనసూయ అడగగా నాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు.నా వయసు 19 అమ్మాయి వయసు 16 అని అనగా వెంటనే మీది బాల్య వివాహమా అంటూ సెటైర్ వేస్తుంది అనసూయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube