సుమంత్ ప్రభాస్( Sumanth Prabhas ) హీరోగా నటిస్తూ.స్వయంగా తానే తెరకెక్కించిన చిత్రం మేమ్ ఫేమస్.
( Mem Famous Movie ) లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిపి చేస్తున్న ఈ సినిమాలో .మణి ఏగుర్ల ,మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్ , పోస్టర్స్ , సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.దీనికి తోడు చిత్ర యూనిట్ చేసిన ప్రత్యేకమైన ప్రమోషన్స్ కూడా సినిమా పై అంచనాలని పెంచాయి .మరి యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫెమస్ అయిన …సుమంత్ ప్రభాస్ కూడా ఫెమస్ అయ్యే సత్తా సినిమాలో ఉందా అనేది రివ్యూ( Mem Famous Review ) ద్వారా తెలుసుకుందాం
ముందుగా కధ విషయానికి వస్తే … ఇది ముగ్గురు స్నేహితుల కధ . ముగ్గురు ఊళ్లో గాలిగా తిరుగుతూ ఉంటారు .అయితే ఊర్లో అనుకోని రీతిలో వీరు విమర్శలకు గురవుతారు .అందరి చేత మాటలు పడుతూ ఉంటారు .దీనితో వాళ్ళు తామెలా కావాలో ఆలోచించుకుంటూ ఉంటారు .చివరగా ఒక నిర్ణయం తీసుకుంటారు .మరి దానితో వాళ్ళు ఫెమస్ అయ్యారా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారా .వారు చివరికి ఏమి సాధించారు అనేది సినిమా కధ .
ఇక విశ్లేషణ విషయానికి వస్తే .సినిమాని ఆసక్తికరంగా .సరదాగా తెరకెక్కించిన విధానం బాగుంది .నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన విధానం బాగుంది .ముగ్గురు స్నేహితులు వాళ్లు కలిసి పెరిగే స్నేహం గురించి ఇందులో చక్కగా చూపించారు.అలాగే తల్లి .పిల్లలు అనుబంధాల్ని చక్కగా చూపించారు … హీరో ప్రేమని .బాగా సెటిలై ఆమెను పెళ్లి చేసుకునే విధానాన్ని ఆకట్టుకునే రీతిలో చూపించారు .ముగ్గురు స్నేహితులు.తామెలా ఫేసమ్ కావాలో నిర్ణయించుకొని .అందుకోసం చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి.
ఈ మధ్య కాలంలో థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించాలంటే ఫన్ మెయిన్ గా ఉండాలి .తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పని పాటలేని ముగ్గురు కుర్రాళ్లు.వాళ్లను ఇంట్లో వాళ్లే కాదు ఊర్లోని తిట్టని వారుండరు.
అలా సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న వీళ్లు లవర్స్‌ను సెట్ చేసుకునే పనిలో పడటం .వాతై వలన ఇబ్బందుకు నవ్వించే రీతిలో చూపించారు .సరదాగా గడిచిపోతున్న ఈ కుర్రాళ్ల జీవితంలోకి సమస్యలు రావడం .తమను తాము ఎలాగైనా నిరూపించుకోవాలని కుర్రాళ్లు ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టడం .అవన్నీ సరదాగా సాగుతూనే ఆసక్తిని పెంచుతాయి .
ఇక నటీనటుల విషయానికి వస్తే .సుమంత్ ప్రభాస్ తాను దేనికి సెట్ అవుతానో అలనాటి కధని రాసుకొని .తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు .అలాగే మణి ఏగుర్ల , మౌర్య చౌదరి తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు , సార్య, సిరి రాసి కూడా ఒకే అనిపిస్తారు .మిగతా వారు తమ పరిధి మేరకు మేప్ప్పించే ప్రయత్నం చేశారు
ఇక దర్శకుడు సాంకేతిక విషయాలకు వస్తే …సుమంత్ ప్రభాస్ ఏ సినిమాను ముందుగానే ఫోన్ లో తీసి మరి నిర్మాతలని ఒప్పించారు .వెండితెరపై కూడా దాదాపు అలాంటి మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేశారు .శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది … సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ ఒకే .అరవింద్ మూలి ఆర్ట్ వర్క్ బాగుంది .కళ్యాణ్ నాయక్ సంగీతం అలరిస్తుంది.మొత్తంగా చుస్తే .సరదాగా సాగుతూనే బాధ్యతలని గుర్తు చేసే ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది .