తెలుగు ప్రేక్షకులకు హీరో సుమన్( Suman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దాదాపు 45 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ 750 పైగా సినిమాలలో నటించి మెప్పించారు.
మొదట్లో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన సుమన్ ఆ తర్వాత హీరో హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్లలో సపోర్టివ్ క్యారెక్టర్ నటించి మెప్పించారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో సుమన్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తిరుమల వెళ్లి దండం పెట్టడం తప్ప వెంకటేశ్వరస్వామి మీద తనకు అంత భక్తీ ఉండేది కాదని, అలాగే పెద్దగా కేర్ చేసేవాడిని కాదు అని తెలిపారు సుమన్.
కానీ , అన్నమయ్య సినిమా( v )లో ఏడుకొండల వాడి పాత్ర చేసిన తరవాత తన మీద ఆ వెంకన్నకు అంత ప్రేమ, ఇష్టం ఉన్నాయని తెలిసిందని అందుకే ఆయన పాత్రను తాను పోషించే అవకాశం కల్పించాడని సుమన్ తెలిపారు.తాజాగా గురువారం తిరుమల కొండపై మీడియాతో మాట్లాడారు.తిరుపతిలో ఉన్న తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి సుమన్.
తిరుమల శ్రీవారి( Tirumala )ని దర్శించుకున్నారు.గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సుమన్ తన అభిమానులు, స్నేహితులతో కలిసి స్వామి వారి ఆశీస్సులు పొందారు.
దర్శనానంతరం సుమన్‌కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.
ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.తాజాగా బుధవారం రాత్రి ఐఏఎస్ అధికారి రామారావు కుమారుడు పెళ్లి తిరుపతిలో జరిగిందని ఆ పెళ్లికి హాజరైన తాను ఈరోజు తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజును పురష్కరించుకుని స్వామివారి దర్శనం చేసుకున్నామని సుమన్ తెలిపారు.
అనంతరం సినిమాల గురించి స్పందిస్తూ.నేను కొన్ని సినిమాలు చేస్తున్నాను.హీరోగా చెంగప్ అనే తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది.సిద్ధన్న గట్టు అనే ఫ్యాక్షన్ మూవీ కర్నూలులో జరుగుతోంది.
అవేకాకుండా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను.నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా భగవంతుడు నాకు అండగా నిలబడ్డాడు.
ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి పాత్ర ఎన్టీఆర్ తరవాత అన్నమయ్య సినిమాలో నాకు ఇచ్చి, నాకు మంచి పేరు వచ్చేలా చేశాడు అని తెలిపారు సుమన్.