నీచల్ కులమ్ అనే తమిళ సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు సుమన్( Suman ).90 లలో ఇండస్ట్రీలో నటుడిగా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా హీరోగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమన్ ఒక్కసారిగా జైలు పాలు కావడంతో ఈయన సినీ కెరీర్ కు బ్రేక్ పడింది.తను తప్పు లేకపోయినా ఈయన జైలు పాలు కావడంతో సినిమా అవకాశాలను కోల్పోయారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో సుమన్ తన వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు.నా తప్పు లేకపోయినా అనవసరంగా నన్ను జైలుకు పంపారని అయితే ఆ సమయంలో సుహాసిని( Suhasini ) సుమలత ( Sumalatha )ఇద్దరు హీరోయిన్స్ నాకు మద్దతుగా మాట్లాడటం తనకు ఎంతో సహాయపడిందని తెలిపారు.ఇక తన కూతురి పెళ్లి గురించి కూడా ఈ సందర్భంగా సుమన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా సుమన్ తన కుమార్తె అఖిలజ ప్రత్యూష ( Akhilaja Prathyusha) గురించి మాట్లాడుతూ.తనకు సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదని తెలిపారు.రెండు సంవత్సరాల క్రితం తను మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్ లో గోల్డ్ మెడల్ సాధించింది.ఇక తన కుమార్తె సౌత్ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం లేదని ఈ సందర్భంగా సుమన్ వెల్లడించారు.ప్రస్తుతం తనకు పెళ్లి చేయాలని పూర్తి ఆలోచనలో తాము లేమని తన చదువు పూర్తి అయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాము అంటూ ఈ సందర్భంగా సుమన్ తన కుమార్తె పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.