సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది.హీరోయిన్స్ అయితే సోషల్ మీడియాని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు.
ఎప్పటికప్పుడు తమ గ్లామర్ ఫోటో షూట్ లు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కిదగ్గరగా ఉంటారు.అలాగే అప్పుడప్పుడు లైవ్ లోకి వచ్చి కబుర్లుకూడా చెబుతారు.
మన హీరోలు అంత యాక్టివ్ గా ఉండకపోయిన అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు.సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.
అలాగే సోషల్ ఇష్యూల మీద రియాక్ట్ అవుతూ ఉంటారు.సెలబ్రెటీల ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు.
తమ అభిమాన హీరోలని ఫాలో అవుతూ వారు పెట్టె పోస్టులకి లైక్ లు కొడుతూ, వారి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు యాక్టివ్ గా లేని సెలబ్రెటీలు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలోకి వస్తున్నారు.
ఆ మధ్య కాలంలో చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాడు.
నిశ్శబ్దం సినిమా రిలీజ్ తరువాత అనుష్క శెట్టి కూడా ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చింది.
అప్పుడప్పుడు అప్డేట్స్ పెడుతుంది.కొద్ది రోజుల్లోనే అనుష్కని ఫాలో అయ్యేవారి సంఖ్య నాలుగు మిలియన్స్ ని చేరువ అయిపొయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరో సోషల్ మీడియా ఎంట్రీకి ముహూర్తం పెట్టాడు.కోలీవుడ్ లో మన్మధుడుగా గుర్తింపు పొందిన హీరో శింబు ఇంత కాలం సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చాడు.
అయితే ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్, పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.దానికి 22న ముహూర్తం పెట్టాడు.
ఉదయం 9:09 గంటలకి సోషల్ మీడియాలో యాక్టివ్ కాబోతున్నట్లు ప్రకటించాడు.