ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి అవసరం లేకుండా వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు.వారిలో ఒకరు రాజశేఖర్.
( Rajasekhar ) కెరీర్ ప్రారంభం సైడ్ క్యారెక్టర్స్ మరియు విలన్ క్యారెక్టర్స్ ద్వారా పాపులరైన రాజశేఖర్, ఆ తర్వాత హీరో గా అవకాశాలను సంపాదించి, హిట్ మీద హిట్ కొడుతూ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజిని సొంతం చేసుకున్నాడు.ఈయన ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తూ వచ్చేవాడు, పోలీస్ క్యారెక్టర్స్ కి ఇతను బాగా ఫేమస్.
ఇక ఇతని నటన వెండితెర మీద చూస్తున్న సమయం లో ‘అబ్బా ఏమి చేసాడు రా’ అని అనిపించడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఆయన స్వరం.వాస్తవానికి రాజశేఖర్ కి తెలుగు సరిగా రాదు, వచ్చినా కూడా ఆయన వాయిస్ వినసొంపుగా ఉండదు.
తమిళ వాడు మాట్లాడుతున్నట్టే ఉంటుంది.అందుకే మొదటి నుండి ఆయనకీ సాయి కుమార్( Sai Kumar ) డబ్బింగ్ చెప్తూ వచ్చాడు.

అప్పట్లో రాజశేఖర్ మరియు సుమన్ వంటి హీరోలకు డబ్బింగ్ చెప్పేది సాయి కుమార్ మాత్రమే.ఒక్క మాటలో చెప్పాలంటే సాయి కుమార్ లేకపోతే వీళ్ళకి అసలు కెరీర్ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఉదాహరణకి ఒక సంఘటన చెప్పాలి.ఒకానొక దశలో సాయి కుమార్ రాజశేఖర్ కి డబ్బింగ్( Dubbing ) చెప్పడం మానేసాడు.అందుకే రాజశేఖర్ చాలా హర్ట్ అయ్యాడు.సాయి కుమార్ డబ్బింగ్ లేకపోవడం వల్ల రాజశేఖర్ సినిమాలు కొన్ని బాగున్నప్పటికీ కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.
ఎందుకంటే మొదటి నుండి రాజశేఖర్ ని ఆ వాయిస్ తోనే చూసారు ప్రేక్షకులు.ఇప్పుడు కొత్త గొంతుకి అలవాటు పడలేకపోయారు, సహజత్వానికి చాలా దూరంగా అనిపించింది.
అందుకే కమర్షియల్ గా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పడం మానేసినప్పుడు సాయి కుమార్ మరియు రాజశేఖర్ మధ్య ఏర్పడిన కొన్ని సంఘటనల గురించి సాయి కుమార్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నేను డబ్బింగ్ చెప్పడం మానేసినప్పుడు రాజశేఖర్ చాలా బాధపడ్డాడు.ఒకానొక దశలో మా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.రాజశేఖర్ ఎమోషనల్ గా నాకు డబ్బింగ్ చెప్పకుండా ఇండస్ట్రీ లో ఎలా బ్రతుకుతావో నేను కూడా చూస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు.ఎప్పుడైతే మా అమ్మగారి డైరీ చూశానో, అందులో ఆమెకి రాజశేఖర్ అంటే ఎంత అభిమానం ఉంది అనేది చెప్పిందో, అప్పటి నుండి మళ్ళీ రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాను.
అలా నా రీ ఎంట్రీ ‘ఎవడైతే నాకేంటి’ సినిమా ద్వారా ప్రారంభం అయ్యింది.ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యింది, ఇప్పటికీ రాజశేఖర్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి రెడీ’ అంటూ సాయి కుమార్ గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రాజశేజర్ ఎలాంటి సినిమాలు చెయ్యడం లేదు.ఆయన చివరి చిత్రం శేఖర్, ఇది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు.







