యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే స్టార్ హీరో కాదు.ప్రస్తుతం ఆయన ఆల్ ఇండియా స్టార్ హీరో అనే విషయం తెల్సిందే.
ప్రముఖ స్టార్స్‌కు కూడా దక్కని అరుదైన గౌరవం ఆయనకు దక్కింది.బాహుబలి ఇంకా సాహో చిత్రాలతో ఆయన దక్కించుకున్న స్టార్‌డం అంతా ఇంతా కాదు.
అందుకే ఆయనతో సినిమాలు నిర్మించేందుకు ప్రముఖ బాలీవుడ్ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయి.
బాలీవుడ్‌లో ప్రభాస్ సినిమాలను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం సౌత్ సినిమాలు ఇంకా సౌత్ దర్శకులపై ఆసక్తి చూపుతున్నాడు.
ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రూపొందబోతున్న ఆ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ సమయంలోనే ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో టీసిరీస్ వారు ఒక సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అర్జున్ దర్శకుడు సందీప్ చెప్పిన కథకు ప్రభాస్ ఓకే చెప్పాడని, త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు.బాహుబలి, సాహో, జాన్ చిత్రాలకు చాలా టైం తీసుకున్న ప్రభాస్ ఈసారి మాత్రం ఎక్కువ సమయం తీసుకోవద్దని నిర్ణయించుకున్నాడట.