శ్రీలీల కి అంత సీన్ లేదు..అందుకే దూరం పెట్టాం అంటూ నితిన్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల( Sreeleela ) మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.వచ్చిన రెండేళ్లకే ఆమె టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానం ని ఆక్రమించుకుంది.

 Hero Nithin Shocking Comments On Sreeleela Details, Hero Nithin , Sreeleela, Ext-TeluguStop.com

అయితే క్రేజ్ ఉందని, అవకాశాలు వస్తున్నాయని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఎంత వేగంగా ఇండస్ట్రీ లో ఎదిగారో, అంతే వేగంగా క్రిందకి పడిపోగలరు.గతం లో ఎంతో మంది హీరోయిన్స్ విషయం లో ఇది జరిగింది.

అందుకు ఉదాహరణే కృతి శెట్టి.( Krithi Shetty ) ఇప్పుడు శ్రీలీల కూడా మరో కృతి శెట్టి గా మారిపోనుంది అని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే ఆమె ధమాకా చిత్రం తర్వాత రీసెంట్ గా చేసిన సినిమాలలో ‘భగవంత్ కేసరి’( Bhagavanth Kesari ) చిత్రం తప్ప, మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.దీంతో శ్రీలీల పని అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

డ్యాన్స్ తప్ప ఈ అమ్మాయికి ఏమి రాదనీ, ఎక్కువ రోజులు ఇండస్ట్రీ లో కొనసాగదని అంటున్నారు.

Telugu Extra Ordinary, Extraordinary, Nithin, Sreeleela, Krithi Shetty-Movie

ఇకపోతే శ్రీలీల హీరోయిన్ గా నటించిన మరో సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.( Extra Ordinary Man ) నితిన్ హీరో గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 8 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు హీరో నితిన్.

( Nithin ) ఈ చిత్రం లో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతుంది అని రీసెంట్ ఇంటర్వ్యూ లో అడగగా, దానికి నితిన్ సమాధానం ఇస్తూ ‘ఒక కమర్షియల్ సినిమాలో హీరో మరియు హీరోయిన్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఈ చిత్రం లో కూడా శ్రీలీల కి అంతే ఉంటుంది.ఆమెది గొప్ప పాత్ర అని నేను చెప్పను, నాలుగు సాంగ్స్ , నాలుగు ఫైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె కనిపిస్తుంది.

అలాంటి పాత్రకే ఆమె ఈ సినిమాకి పరిమితం, ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి’ అంటూ చెప్పుకొచ్చాడు నితిన్.

Telugu Extra Ordinary, Extraordinary, Nithin, Sreeleela, Krithi Shetty-Movie

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.నితిన్ చాలా కాలం తర్వాత తనకి తగ్గ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు, చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు ఉంది.

కచ్చితంగా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. ‘మాచెర్ల నియోజకవర్గం’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నితిన్ చేస్తున్న చిత్రం ఇది.ఈ సినిమా మీద ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube