హీరో నిఖిల్ పై ట్రోల్స్.. దిల్ రాజు పేరు తియ్యనేలేదు అనడంతో?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఇటీవల విడుదలయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించిన సందర్భంగా చిత్ర బంధం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 Hero Nikhil Siddharth On Dil Raju Over Karthikeya 2 Movie Postpone Issue Details, Nikhil Siddharth, Dill Raju, Karthikeya 2, Tollywood, Karthikeya 2 Success Meet, Producer Dil Raju, Anupama Parameswaran, Srinivas Reddy, Nikhil Dil Raju-TeluguStop.com

ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు కనిపించడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ప్రెస్టేజ్ మీదకు ఎక్కిన దిల్ రాజు మైక్ అందుకొని తనపై వస్తున్న రూమర్స్ గురించి గట్టిగానే స్పందించాడు.

మొత్తం మీరే చేశారంటూ మీడియా పై నోరు పారేసుకున్నారు.తెలిస్తే రాయండి.

 Hero Nikhil Siddharth On Dil Raju Over Karthikeya 2 Movie Postpone Issue Details, Nikhil Siddharth, Dill Raju, Karthikeya 2, Tollywood, Karthikeya 2 Success Meet, Producer Dil Raju, Anupama Parameswaran, Srinivas Reddy, Nikhil Dil Raju-హీరో నిఖిల్ పై ట్రోల్స్.. దిల్ రాజు పేరు తియ్యనేలేదు అనడంతో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేదంటే మూస్కోండి అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు దిల్ రాజు.

కానీ ఈ వివాదానికి ప్రధాన కారణం అయిన హీరో నిఖిల్ మాత్రం దిల్ రాజు మాట్లాడుతుంటే వెనకే నుండి నవ్వుకుంటూ ఉన్నాడు.

అయితే సినిమా రిలీజ్ కాకముందు నా సినిమా రిలీజ్ చేయకుండా అడ్డుపడ్డారు అని ముసలి కన్నీళ్లు కార్చిన నిఖిల్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు.సక్సెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ నా సినిమాని సపోర్ట్ చేయడానికి అరవింద్ గారు వచ్చారు.

దిల్ రాజు గారు వచ్చారు.నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్ అంటూ ఓ రేంజ్‌లో యాక్ట్ చేసాడు.

అయితే నిర్మాత దిల్ రాజు మీడియాపై ఫైర్ అవ్వడానికి ప్రధాన కారణం నిఖిల్.దిల్ రాజు గురించి ఈ విధంగా మాట్లాడాడు.

దిల్ రాజు.ఏషియన్ సునీల్‌గారు నా ప్రొడ్యుసర్స్.వాళ్లతో సినిమాలు చేశాను కూడా.

Telugu Dill Raju, Karthikeya, Karthikeya Meet, Nikhil Dil Raju, Dil Raju, Srinivas Reddy, Tollywood-Latest News - Telugu

వాళ్లేం అంటారంటే.ఎందుకు క్లాష్ తరువాత రావొచ్చు కదా అని.వాళ్లు చెప్పింది కరెక్టే కానీ.మరి మా సినిమా ఎప్పుడు రావాలి? ఆరోజు చాలా ఫీల్ అయ్యాను.వాళ్లని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది.

థియేటర్స్ దొరకడం కష్టం అనేది నాకు ఈ సినిమాతోనే తెలిసింది.మా సినిమా అన్నమయ్య, అరుంధతి రేంజ్‌ అని.వాళ్లని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశాను.మా సినిమాని చివర్లో రిలీజ్ చేసుకోమన్నారు.

నేను దానికి బాధపడ్డాను.ప్రతిసారి మా సినిమానే వెనక్కి నెట్టడం మాకు బాధకలిగించింది అని అన్నారు హీరో నిఖిల్.

ఇక సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు స్టేజి మీదకు ఎక్కి కాస్త ఘాటుగా స్పందించగానే వాళ్లతో పెట్టుకుంటే కష్టం అనుకున్న నిఖిల్ వెంటనే ప్లేట్ తిప్పేశాడు.ఇప్పుడైతే అసలు తాను దిల్ రాజు పేరు ప్రస్తావించలేదంటూ పచ్చి అబద్ధాలు ఆడుతూ.

దిల్ రాజుకి వంత పడుతున్నాడు.సినిమా హిట్ అయిన తరువాత హీరోగారు స్వరం మార్చుతూ.

రాజుగారి పాట మొదలుపెట్టాడు.సినిమా వాయిదా వేసుకోమని దిల్ రాజు చెప్పలేదు.

నేను ఎవరి పేరు తీయలేదు.మా సినిమాకి దిల్ రాజు గారు చాలా హెల్ప్ చేశారు అని అంటున్నాడు హీరో నిఖిల్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube