అందాల రాక్షసి( Andala rakshashi ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు నటుడు నవీన్ చంద్ర ( Naveen Chandra ) ఈ సినిమా ద్వారా తన నటనతో మెప్పించినటువంటి ఈయన అనంతరం పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించారు.అయితే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా నటించి సందడి చేశారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళుతున్నటువంటి నవీన్ చంద్ర తాజాగా మంత్ ఆఫ్ మధు ( Month Of Madhu ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే సినిమా నుంచి టీజర్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.నవీన్ చంద్ర సైతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
తన తండ్రి ఆర్టీసీ మెకానిక్ అని తెలిపారు.అయితే చిన్నప్పటి నుంచి నాకు నటనపై ఎంతో ఆసక్తి ఉండడంతో సినిమాలలోకి రావాలని అనుకున్నాను నాకు సినిమాలలోకి వచ్చే ముందు వరకు కూడా నటన అంటే ఏంటో తెలియదు కేవలం డాన్స్ మాత్రమే తెలుసు .నాకు నేర్పించారు అంటే అది కేవలం నాకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శకులు అని చెబితే కరెక్ట్ గా ఉంటుందని ఈయన తెలియజేశారు.ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పట్టిందని తెలిపారు.అయితే ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక తను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.
ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి నాకు దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది అంటూ ఈ సందర్భంగా తన కెరీయర్ గురించి నవీన్ చంద్ర చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
.