టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Nani ) తాజాగా నటించిన చిత్రం హాయ్ నాన్న( Hi Nanna ) ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.శౌర్యువ్ దశకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసారు హీరో నాని.కూతురు పాత్రలో నటించిన కియారా కన్నా అనే పాపతో కలిసి ముంబై నుంచి హైదరాబాద్ వరకు బాగా సినిమాని బాగానే ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో సెన్సార్ సభ్యుల కోసం హాయ్ నాన్న సినిమాను స్పెషల్ షో వేశారు.ఇక ఆ సినిమాను చూసి ఒక సెన్సార్ సభ్యుడు కన్నీళ్లు పెట్టుకున్నారట.
అంతలా సినిమాలో సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది.మూవీలో నానితో పాపకి ఉన్న సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి కంటతడి పెట్టడమే కాకుండా అందరిని కదిలించేవిలా ఉన్నాయట.
కాగా ఇందులో మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆమె గ్లామర్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవడం ఖాయం అని తెలుస్తోంది.

ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది.మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే నాని సినిమాలలో ఇప్పుడు హాయ్ నాన్న కూడా చేరినట్టే కనిపిస్తుంది.మరి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి మరి.అయితే ఈ సినిమా తప్పకుండా హిట్ సాదిస్తుంది అని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉన్నారు.మరి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న హాయ్ నాన్న సినిమా ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.







