నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) సినిమా ఇండస్ట్రీలో చకచగా ఎదిగేశాడు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళాడు.
ప్రస్తుతం 50 కోట్ల బడ్జెట్ తో అతని సినిమాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి.మరి నాని ఈ స్థాయిలో ఉన్నాడంటే అతనికి సినిమాపై ఉన్న ఫ్యాషన్ ముఖ్య కారణం.
ఎంతలా అంటే తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరాడు.దానికి అతడు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
అయితే తన జీవితంలో జరిగే అనేక సంఘటనలు ఎలాంటి భయాలు లేకుండా అందరితో పంచుకుంటాడు నాని.తను చదువుల్లో వీక్ అనే విషయాన్ని కూడా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.
సరదాగా నాని తన ఇంటర్వ్యూ లో చెప్పేస్తూ ఉంటాడు.అలాంటి ఒక సరదా సంఘటన తన పదవ తరగతి పరీక్షల ఫలితాల( Tenth Exam Results ) సమయంలో జరిగిందట.
ఇంతకి ఆ సంఘటన ఏంటి ? దానివల్ల జరిగిన లాభం ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నానికి 10వ తరగతి పరీక్షల ఫలితాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అందరికి ఒక క్లారిటీ ఉంది.మహా అయితే మూడో క్లాస్ లో పాస్ అవుతాడు… లేదంటే ఫెయిలవుతాడు.అంత కన్నా పెద్దగా నాని దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఆశించలేదట.
అప్పట్లో ఆన్ లైన్ లేదు కాబట్టి పేపర్స్ లో రిజల్ట్స్ ప్రింట్ చేసేవారు.అలా టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు నాని తో పాటు తన తల్లి( Nani Mother ) కూడా ఫలితాల గురించి తెలుసుకోవాలని మొదట థర్డ్ క్లాస్ లిస్టులోనే వెతకడం ప్రారంభించారట.
అక్కడ దొరకక పోవడంతో ఇంకా నాని ఫెయిల్ అయిపోయాడు అని అందరూ డిసైడ్ అయ్యారట.

అందరి కన్నా ముందు నాని తాను ఫెయిల్ అయ్యానని పక్కాగా నమ్మేసాడట.కానీ నాని పైన ఎంతో అపార నమ్మకం ఉన్న నాని తల్లి ఎందుకైనా మంచిది సెకండ్ క్లాస్ లో చూద్దాం అని అనుకుని చూస్తే అక్కడ కూడా తన నెంబర్ కనిపించలేదట.దాంతో ఆమె కూడా ఇక వీడి వల్ల అయ్యే పని కాదు.
ఖచ్చితంగా పరీక్ష దొబ్బేసాడు అని అనుకుందట.కానీ అతనిపై నమ్మకం లేకపోవడంతో ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ లో వెతకడం మాత్రం చేయలేదట.
చివరికి తన స్నేహితులు నాని ఫస్ట్ క్లాస్ లో పాస్( First Class Pass ) అయ్యాడని చెప్పడంతో గబగబా వెళ్లి ఫస్ట్ క్లాస్ లో వెతకడంతో నాని రిజల్ట్స్ కనిపించిందట.అలా టెన్త్ క్లాస్ మాత్రమే మొట్టమొదటిగా చివరగా పాస్ అయినా ఒక పరీక్ష అని, ఆ తర్వాత ఏ ఎగ్జామ్ కూడా తిన్నగా పాస్ అయింది లేదు అంటూ నాని ఓసారి సరదాగా ఇంటర్వ్యూలో చెప్పకచ్చాడు.