తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.ఈ క్రమంలో పార్టీకి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది.
దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడతారంటూ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రచారానికి తెర పడింది.అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాసానికి టికెట్ ఇవ్వడంపై ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే రంజిత్ రెడ్డి హస్తం గూటికి చేరతారని, రానున్న ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జోరందుకుంది.కాగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే.







