Mahesh Raghvan : ఐప్యాడ్‌పై అదిరిపోయే మ్యూజిక్ ప్లే చేసిన యువకుడు.. వీడియో వైరల్..

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఆనంద్ ప్రతిభావంతులను ప్రశంసిస్తూ వారి వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటారు.

చాలా మందిలో ఆసక్తిని ఆకర్షించే కంటెంట్‌ను కూడా ఎక్కువగా పంచుకుంటారు.అతని సోషల్ మీడియా ఖాతా( Social Media ) వైరల్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటే అతిశయోక్తి కాదు.

ఈ కంటెంట్ తో పాటు ఆయన అందించే విలువైన వ్యాపార చిట్కాల కోసం( Business Tricks ) చాలామంది ఫాలో అవుతుంటారు.సినిమా సెలబ్రిటీలకు ఏమాత్రం తీసుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆనంద్ మహీంద్రా సొంతం.

రీసెంట్‌ పోస్ట్‌లో మహీంద్రా ఒక వీడియోను షేర్ చేయగా అది చాలా మందిని ఆకర్షించింది.ఇందులో మహేష్ రాఘవన్( Mahesh Raghvan ) అనే ఆర్టిస్ట్ ఐప్యాడ్‌లో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్లే చేయడం కనిపించింది.

Advertisement

ఆ క్లాసికల్ మ్యూజిక్‌ను ఈ మోడర్న్ పరికరంలో వాయించడం చూసి చాలామంది షాక్ అయ్యారు.రాఘవన్ డిజిటల్ ట్యాబ్లెట్‌( Digital Tablet )పై సాధారణంగా శాస్త్రీయ వాయిద్యాల ద్వారా చేసే శబ్దాలను ప్రొడ్యూస్ చేయడం విని అందరూ వావ్ అన్నారు.ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్పు ఓపెన్ చేస్తే మనకు రాఘవన్ తన ఐప్యాడ్‌లో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్( Indian Classical Music ) చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నట్లు కనిపిస్తుంది.

మహీంద్రా తన పోస్ట్‌లో రాఘవన్ నైపుణ్యానికి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.సంగీతకారులు ఐప్యాడ్స్‌ను తమ వాయిద్యాలుగా ఉపయోగించుకునే ఆలోచనను చూసి అతను ఆశ్చర్యపోయారు.

మొత్తం ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడం అంత సులభమైన పని కాదని అన్నారు.ఆధునిక పరికరంతో అందమైన సంగీతాన్ని సృష్టించగల రాఘవన్ సామర్థ్యాన్ని ప్రశంసించారు.వీడియో షేర్ చేసిన సమయం నుంచి ఇది చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.

వారు రాఘవన్ టాలెంట్ కు ముగ్ధులవ్వడమే కాకుండా సాంకేతికత, సంప్రదాయాల కలయికకు మంత్రముగ్ధులయ్యారు.రాఘవన్ ఇలా మ్యూజిక్ వాయించడం అనేది క్రియేటివిటీలో మాస్టర్‌క్లాస్ అని పిలిచారు.అతను వాయించిన ట్యూన్‌ను రాగ్ భైరవి( Raag Bhairavi ) అనే ఒక క్లాసిక్ ఇండియన్ మెలోడీగా గుర్తించారు.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు