తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత అలాంటి క్రేజ్ ఉన్న హీరోలలో కృష్ణ ఒకరు.కృష్ణ ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలోనూ ప్రేమకథా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో మహేష్ బాబు హీరోగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే మహేష్ బాబు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం కృష్ణ గారి వయసు పై పడటంతో ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలో ఇస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ గారికి తన అభిమాన హీరో ఎవరు అంటూ ప్రశ్న ఎదురయింది.
సాధారణంగా ఒక స్టార్ సెలబ్రిటీలకు వారి వారసులు అభిమాన నటీనటులుగా ఉంటారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని అయితే మహేష్ కాకుండా తనకు మరొక హీరో అంటే కూడా ఇష్టం అని ఈ సందర్భంగా కృష్ణ వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో మహేష్ బాబు కాకుండా తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని కృష్ణ చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ తో కృష్ణగారికి ఉన్న అనుబంధం గొడవ గురించి కూడా బయటపెట్టారు.అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్టీఆర్ వద్దని చెప్పినప్పటికీ తాను చేయడం వల్ల దాదాపు పది సంవత్సరాలు మా ఇద్దరి మధ్య మాటలు లేవని అయితే చివరికి అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ చాలా అద్భుతంగా చేశారు అంటూ తనని కౌగిలించుకొని ప్రశంసలు కురిపించారని కృష్ణ వెల్లడించారు.